తాత్కాలిక ప‌దవుల కోసం అర‌చ‌కం సృష్టిచేస్తే ఊరుకోము- చంద్ర‌బాబు

అమ‌రావ‌తి:ఆంధ్ర‌ప్ర‌దేశంలో మ‌రోసారి రాజ‌కీయ దూమారం రేపింది. టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యంలో సుప్రీంకోర్టు తీర్పును అర్థం చేసుకోలేదంటే.. ఆమె (ఎస్ఈసీ నీలం ) ఈ ప‌దవికి అర్హురాలా.. కాదా అనేది చూడాల‌న్నారు. టీడీపీ డిజిట‌ల్ మ‌హానాడు చంద్ర‌బాబునాయుడు ముచ్చ‌టిస్తూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు మాస్క్ అడిగిన పాపానికి డాక్ట‌ర్ సుధాక‌ర్‌ను పిచ్చివాడిని చేసి చంపార‌ని చెప్పారు. త‌న ఇంటికి తాళ్లు క‌ట్ట‌డం ద‌గ్గ‌ర నుండి విశాఖ‌లో త‌న‌ను వెన‌క్కి పంపే వ‌ర‌కు ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రించాల‌ని మండిపడ్డారు. మీడియాపైనే అక్ర‌మ కేసులు పెడుతున్నార‌ని, దేశద్రోహం కేసులు కూడా పెడుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చ‌ట్ట వ్య‌తిరేకంగా అరెస్ట్ చేస్తే భ‌విష్య‌త్‌లో త‌గిన మూల్యం చెల్లించుకుంటార‌ని హెచ్చరించారు. తాత్కాలిక ప‌దవుల కోసం రాష్ట్రాన్ని స్టేట్ టెర్ర‌రిజంగా మారిస్తే చూస్తూ ఊరుకోమ‌ని చంద్ర‌బాబు తేల్చిచెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *