తెలుగు త‌మ్ముళ్ల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం….

విజ‌యవాడ‌: ఏపీరాష్ట్రంలో రాజ‌కీయాల్లో ర‌గ‌డం జ‌రుగుతుంద‌న్నారు.తెలుగుదేశంపార్టీ లో కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య విభేదాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారాచంద్ర‌బాబునాయుడు జోక్యం చేసుకోవ‌డంతో వివాదం స‌ద్దుమ‌ణిగాయి. నేడు ఉద‌యం నుంచి హాట్ హాట్‌గా సాగిన బెజ‌వాడ రాజ‌కీయాల‌ను చంద్ర‌బాబు కట్ట‌డి చేశారు. టెలికాన్ప‌రెన్స్‌లో అంద‌రితో మాట్లాడిన చంద్ర‌బాబు.. అసంతృప్తి నేత‌ల‌ను స‌ముదాయించిన‌ట్టు తెలుస్తుంది. అధినేత ఆదేశాల‌తో బెజ‌వాడ నేత‌ల‌తో అచ్చెన్నాయుడు, టీ.డి.జ‌నార్థ‌న్‌, వ‌ర్ల రామ‌య్య చ‌ర్చించారు. విభేదాల‌ను ప‌క్క‌న పెట్టి క‌లిసి ప‌నిచేయాల‌ని నేత‌లు నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. ఆదివారం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో అంద‌రూ పాల్గొని శ్వేత‌ను గెలిపించేందుకు కృషిచేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *