న‌గరం న‌డ్డిబొడ్డున నోరు పారేసుకున్నా మంత్రికి కౌంట‌ర్‌..

విజ‌య‌వాడ‌: ఏపీరాష్ట్రంలో అధికారం పార్టీ విప‌క్ష‌ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసే భ‌గ్గుమంటుంది. జగ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తుంద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. టీడీపీ అధ్య‌క్ష‌డు నారాచంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర మంత్రి కొడాలిపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శిలు చేశారు. ఆదివారం విజ‌య‌వాడ‌లో జరిగిన రోడ్ షోలో మాట్లాడిన చంద్ర‌బాబు ఒక‌డు బూతుల మంత్రి.. నోరు పారేసుకుంటాడు. పేకాట ఆడిస్తాడు. . ఆడితే త‌ప్పేముంది అంటాడు. ఎంత సింపుల్ సమాధానం. తాడేప‌ల్లిలో సీఎం ద‌గ్గ‌ర‌కు వెళ్లి ద‌ర్జాగా బ‌య‌ట‌కు వ‌స్తాడు. అంటే పెద్ద సార్ ఆశీస్సులు తీసుకున్న‌ట్టా? అంటూ కొడాలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేయ‌ర్ ప‌ద‌విని సాధించాల‌ని , లేదంటే విజ‌య‌వాడ జ‌నం త‌లెత్తుకు తిర‌గ‌లేర‌న్నారు. నేర‌స్థుల అడ్డాగాఆంధ్ర‌ను త‌యారు చేస్తున్నార‌ని వాపోయారు. పేదోళ్ల‌కు క‌నీసం ఐదు రూపాయాల భోజ‌నం పెడుతుంటే… టీడీపీకి పేరొస్తుంద‌నే భ‌యంతో … అన్నా క్యాంటీన్‌ల‌ను నిరుప‌యోగం చేశార‌ని తెలిపారు. ప్ర‌త్యేక హోదాకోసం ఢిల్లీ మెడ‌లు వంచుతా అన్నాడు… ప్ర‌త్యేక హోదా ఏమైంది? ఎవ‌రికైనా న్యాయం జ‌రిగిందా? అని ప్ర‌శ్నించారు. త‌మ పాల‌న‌లో నిరుద్యోగ భృతి ఇచ్చామ‌ని, ప్ర‌స్తుతం దాన్ని తీసేశార‌న్నారు. పెళ్లి కానుక రావ‌డం లేద‌ని, భ‌రోసాను పెంచామ‌ని చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *