జ‌గ‌న్ స‌ర్కార్ హైకోర్టు ఝ‌ల‌క్‌…

అమ‌రావ‌తి:ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో టీడీపీఅధినేత చంద్ర‌బాబు, మాజీ మంత్రినారాయ‌ణ‌కు ఊర‌ట ల‌భించింది. చంద్ర‌బాబు త‌ర‌పున అనుమ‌తి ఇస్తే అన్ని విష‌యాలు తెలుస్తాయ‌ని సీఐడీ అధికారులు కోర్టుకు తెలిపారు. చంద్ర‌బాబు సీఐడీ విచార‌ణ‌పై ఏపీ హైకోర్టు స్టే విధించింది. చంద్ర‌బాబు, నారాయ‌ణ‌పై కేసులో స్ప‌ష్ట‌మైన ఆధారాలు ఉంటే చూపించాల‌ని సీఐడీని న్యాయ‌మూర్తి కోరారు. ప్ర‌భుత్వం త‌ర‌పున సిద్ధార్థ‌లూథ్రా , అలాగే నారాయ‌ణ త‌ర‌పున ద‌మ్మాల‌పాటి శ్రీ‌నివాస్‌లు వాదించారు. ప్ర‌భుత్వం త‌ర‌పున అడిష‌న‌ల్ ఏజీ జాస్తి నాగ‌భూష‌ణ వాద‌న‌లు వినిపించారు. రాజ‌ధాని అసైన్డ్ భూముల వ్య‌వహారంలో సీఐడీ త‌న‌పై న‌మోదు చేసిన కేసును కొట్టి వేయాల‌ని కోరుతూ చంద్ర‌బాబు గురువారం హైకోర్ట‌లో పిటీష‌న్ దాఖలు చేశారు. వైఎస్. జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాను,టీడీపీ స‌భ్యుల కు వ్య‌తిరేకంగా పాల్ప‌డుతున్న చ‌ట్ట‌విరుద్ద కార్య‌క‌లాపాల‌ల్లో భాగంగానే కొత్త కేసు న‌మోదు చేశార‌న్నారు. ఈవిష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని 2నెల‌12న సీఐడీ అధికారులుత‌న‌పై న‌మోదు చేసిన కేసును కొట్టి వేయాల‌ని కోరారు. ఈకేసులో అరెస్ట్ తోపాటు త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకోకుండా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇవ్వాల‌ని కోరారు. చంద్ర‌బాబు కేసుపై హైకోర్టులో విచార‌ణ ..ఏం గుర్తించార‌ని సీఐడీని ప్ర‌శ్నించిన కోర్టు గొంతు ఎత్తొద్ద‌నే ఏది త‌ప్పు? ఎవ‌రిది త‌ప్పు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *