క‌రోనా రోగుల‌కు ఆస్ప‌త్రిలో అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించాలి…

అనంత‌పురం: ప్ర‌స్తుతం కొవిడ్ మ‌హ‌మ్మారి కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. క‌రోనా పెరుగుతున్న సంద‌ర్భంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ఎమ్మెల్యే నంద‌మూరిబాల‌కృష్ణ ఆరాతీశారు. కొవిడ్ పాజిటివ్ వ‌చ్చిన‌వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా హిందూపురం ఆస్ప‌త్రిలో అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ గంధం చంద్రుడు, ఆసుప్ర‌తి సూప‌రింటెండెంట్ దివాక‌ర్ బాబుతో బాల‌య్య ఫోన్‌లో మాట్లాడారు. కొవిడ్ రోగుల‌కు అన్ని వ‌స‌తులు క‌ల్పించి వైద్యం అందించాల‌ని డీఎంహెచ్‌వోకు సూచ‌న‌లు చేశారు. ప్ర‌జ‌లు క‌రోనా బారిన ప‌డ‌కుండా ప్ర‌తి ఒక్క‌రూ మాస్కులు ధ‌రించి జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఎమ్మెల్యే బాల‌కృష్ణ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *