నాగ‌ర్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌‌కు షెడ్యూల్ విడుద‌ల….

హైద‌రాబాద్‌: మ‌ంళ‌వారం నాగార్జున సాగ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఈనెల 23న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు వెల్ల‌డించింది. మార్చి 30వ‌ర‌కు నామినేష‌న్లు స్వీక‌ర‌ణ‌.31న నామినేష‌న్ల ప‌రిశీల‌న ఉంటుంద‌ని తెలిపింది. ఏప్రిల్ 3వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు ఉంటుంది. 17న ఉప ఎన్నిక పోలింగ్ నిర్వ‌హించ‌నున‌న్న‌ట్లు పేర్కొంది. మే2న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. ఏప్రిల్ 17న తిరుప‌తి లోక్‌స‌భ స్థానానికి సైతం ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్ప‌ష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *