భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎస్వీర‌మ‌ణ ప్ర‌మాణ‌స్వీకారం…

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి (సీజేఐ)గా జస్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేడు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో భార‌త రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆయ‌న‌తో ప్ర‌మాణ స్వీక‌రం చేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు , ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ స‌హా ప‌లువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. సీజేఐ ఎస్‌.ఎ.బొబ్డే ప‌ద‌వీకాలం శుక్ర‌వారానికి ముగియడంతో శ‌నివారం ఆయ‌న స్థానంలో జ‌స్టిస్ ర‌మ‌ణ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 2022 ఆగ‌స్టు 26వ‌ర‌కు ఆయ‌న ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప‌ద‌విని అలంక‌రించిన రెండో తెలుగు వ్య‌క్తిగా జ‌స్టిస్ ర‌మ‌ణ చ‌రిత్ర సృష్టించారు. 2014 ఫిబ్ర‌వ‌రి 17 జ‌స్టిస్ ర‌మ‌ణ సుప్రీంకోర్డు న్యాయ‌మూర్తిగా ప‌దోన్న‌తి పొందిన సంగ‌తి తెలిసిందే. అంత‌కుముందు ఆయ‌న ఢిల్లీ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌గాసేవలు అందించారు. 1957 ఆగ‌స్టు 27న కృష్ణా జిల్లా పొన్న‌వ‌రం గ్రామంలోని ఓ సాధార‌ణ వ్య‌వ‌సాయ కుటుంబంలో జ‌స్టిస్ ర‌మ‌ణ జ‌న్మించారు. 1983 ఫిబ్ర‌వ‌రి 10న అడ్వ‌కేట్‌గా ప్ర‌స్థానం మొద‌లుపెట్టారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు, సెంట్ర‌ల్ ,ఆంధ్ర‌ప్ర‌దేశ్ అడ్మ‌ని స్ట్రేటివ్ ట్రిబ్యున‌ళ్ల‌తో పాటు సుప్రీంకోర్టులో సీవిల్, క్రిమిన‌ల్, రాజ్యాంగ‌,కార్మిక‌,సేవా, ఎన్నిక‌ల బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. 2000 జూన్ 27న ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు శాశ్వ‌త న్యాయ‌మూర్తిగా నియ‌మితుల‌య్యారు. 2003 మార్చి 10 నుండి 2013 మే20 వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జ‌స్టిస్‌గా జ‌స్టిస్ ర‌మ‌ణ ప‌నిచేశారు.శ‌నివారం భార‌త 48వ‌ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ర‌మ‌ణ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *