ఏపీ మున్సిప‌ల్ ఓట్ల లెక్కింపు- అద‌న‌పు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ….

అమ‌రావ‌తి:ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ అద‌న‌పు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.కౌంటింగ్ కేంద్రాల్లో నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండాల‌ని అధికారుల‌కు సూచించింది. విద్యుత్ స‌మ‌స్య ఉత్ప‌న్నం కాకుండా జ‌న‌రేట‌ర్లు, ఇన్వ‌ర్ట‌ర్లు ఏర్పాటు చేసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది. లెక్కింపు ప్ర‌క్రియ‌ను వెబ్‌కాస్టింగ్ , వీయోగ్ర‌ఫీ, సీసీకెమెరాల ద్వారా చిత్రీక‌రించాల‌ని ఆదేశించింది. కౌంటింగ్ ప్ర‌క్రియ పుటేజీల‌ను ఎన్నిక‌ల రికార్డుగా భ‌ద్ర‌ప‌ర‌చాల‌ని పేర్కొంది. రాత్రి 8 గంట‌ల‌లోగా ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ముగించేలా చూడాల‌ని10 కంటే తక్కువ మెజారిటీ ఉన్న‌ప్పుడే రీకౌంటింగ్‌కు అనుమ‌తి ఇవ్వాలంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *