సీఐడీ కోర్టులో బెయిల్ కోసం- అత్యున్న‌త న్యాయ‌స్థానం

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపైనా.. ప్ర‌భుత్వ‌పెద్ద‌ల పైనా వ‌రుస‌గా విమ‌ర్శ‌ల బాణాలు సంధిస్తున్న అధికార పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజును పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి విదిత‌మే.ఈ అరెస్ట్ వ్య‌వ‌హారం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచ‌న‌ల‌మైంది. హైకోర్టులో ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు దాఖ‌లు చేసిన హౌస్ మోష‌న్ పిటిష‌న్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. సీఐడీ కోర్టులో బెయిల్ కోసం ప్ర‌య‌త్నించ‌మ‌ని రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది. నేరుగా హైకోర్టును కాకుండా కింద కోర్టును సంప్ర‌దించాల‌ని హైకోర్టు సూచించింది. అనంత‌రం ర‌ఘురామ‌బెయిల్ ద‌ర‌ఖాస్తుపై వెంట‌నే నిర్ణ‌యం తీసుకోవాల‌ని కింద కోర్టును హైకోర్టు ఆదేశించింది. తీర్పుకాపీని కూడా వెంట‌నే ఇస్తామ‌ని హైకోర్టు తెలిపింది. మ‌రోవైపు వెంట‌నే రిమాండ్ పంపుతామ‌ని ప్ర‌భుత్వ న్యాయ‌వాది కోర్టును వివ‌రించారు. మంగ‌ళ‌గిరి సీఐడీ పీఎస్ లో 124ఏ,153ఏ, రెడ్ విత్ 120బి, 505 సెక్ష‌న‌ల్ కింద కేసులు న‌మోద‌వ్వ‌డం సంచ‌ల‌నం రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *