అత‌ని కెప్టెన్సీలో భార‌త్ వ‌రుస‌గా ఓడిపోతోంది -మాంటీ ప‌నేస‌ర్

చెన్నై: ఇటీవ‌ల చెన్నైలో ఇంగ్లండ్ తో జ‌రిగిన తొలి టెస్ట్‌లోనూ భార‌త్ టీమ్ దారుణంగా ఓడింది. కోహ్లీల్ కెప్టెన్సీలో ఇండియా టీమ్ వ‌రుస‌గా ఓడిపోతుండ‌టంతో విరాట్ కోహ్లీ ఒత్త‌డితో బాధ‌పడుతున్నారు.త‌న కెప్టెన్నీలో ఇది వ‌రుస‌గా నాలుగో టెస్ట్ ఓట‌మి. ఈ నేప‌థ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ మాంటీ ప‌నేస‌ర్ ఆస‌క‌ర వ్యాఖ్య‌లు చేశాడు. త‌రువాతి మ్యాచ్‌లోనూ భార‌త్ ఓడిపోతే కోహ్లీ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటాడ‌ని త‌ను అంచ‌నా వేస్తున్న‌ట్లు ప‌నేస‌ర్ చెప్పాడు.కోహ్లీ ప్ర‌పంచంలోనే మేటి బ్యాట్స్‌మ‌న్ అన‌డంలో సందేహం లేదు. కానీ అత‌ని కెప్టెన్సీలో భార‌త్ వ‌రుస‌గా ఓడిపోతోంది. మ‌రోవైపు అజింక్య ర‌హానే కెప్టెన్సీలో భార‌త్ మ‌రియు ఆస్ట్రేలియాలో సిరీస్ గెలిచింది. ఈ నేప‌థ్యంలో కోహ్లీ తీవ్ర ఒత్త‌డిలో ఉన్నాడు. ఇప్ప‌టికే కోహ్లీ కెప్టెన్సీలో భార‌త్ వ‌రుస‌గా నాలుగు టెస్టులు ఓడింది. త‌రువాతి మ్యాచ్‌లో ఇది ఐదుకు చేరితే కోహ్లీ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటాడ‌ని నేను భావిస్తున్నారు. అని ప‌నేస‌ర్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *