ఎమ్మెల్సీ ఎన్నిక‌లు- కేటీఆర్ గ్రేట‌ర్‌నేత‌ల‌తో భేటీ….

హైద‌రాబాద్‌: హైద‌రాబాద్‌- రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ల నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎస్‌.రామ‌చంద్ర‌రావుల ప‌ద‌వీకాలం మార్చి29తో ముగియ‌నుంది.ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో జీహెచ్ ఎంసీ ప‌రిధిలోని ప్ర‌జాప్ర‌తినిధుల‌తో టీఆర్ఎస్ పార్టీ కార్యానిర్వాహ‌క అధ్య‌క్షుడు, మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు.తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి జీహెచ్ఎంసీ ప‌రిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు,వివిధ కార్పొరేష‌న్ల చైర్మ‌న్లు, మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ , ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. హైద‌రాబాద్‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు కుమారై వాణీదేవి పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *