గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ప‌లు అభివృద్ధి పనులు -కేటీఆర్‌

హైద‌రాబాద్‌: గ‌్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను మంత్రి కేటీఆర్ నేడు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. బేగంపేట‌లోని ధ‌నియాల‌గుట్ట‌లో రూ.4.6కోట్ల‌తో నిర్మించ‌నున్న వైకుంఠ‌దామ ప‌నుల‌ను ప్రారంభిస్తారు. అనంత‌రం కూక‌ట్‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో రూ.18కోట్ల‌కుపైగా నిధుల‌తో చేపట్టిన అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేయ‌నున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉద‌యం 9:30 గంట‌ల‌కు బేగంపేట‌లోని ధ‌నియాల‌గుట్ట శ్మ‌శాన‌వాటిక అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభిస్తారు. అనంత‌రం 10:10 గంట‌ల‌కు ఫ‌తేన‌గ‌ర్‌లో రూ. 270.50 ల‌క్ష‌ల‌తో నిర్మిస్తున్న నాలా విస్త‌ర‌ణ ప‌నుల‌కు, 10:20 గంట‌ల‌కు కేపీహెచ్‌బీ కాల‌నీలోని బాలాజీన‌గ‌ర్‌లో రూ.155 ల‌క్ష‌ల‌తో నాలా విస్త‌ర‌ణ ప‌నులు, 10:30గంట‌ల‌కు బాలాజీన‌గ‌ర్ లో రూ. కోటి వ్య‌యంతో ఇండోర్ షెటిల్‌కోర్టు నిర్మాణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తారు. జేఎన్‌టీయూ మంజీరా మాల్ వ‌ద్ద రూ.48 ల‌క్ష‌ల‌తోనిర్మించ‌నున్న పార్క్ ప‌నుల‌ను ఉద‌యం 10:40
గంట‌ల‌కు ప్రారంభించ‌నున్నారు. త‌రువాత 10:50 గంట‌ల‌కు కేపీహెచ్‌బీ 4వ ఫేజ్‌లో రూ. కోటి వ్య‌యంతో
స్పోర్ట్స్ కాంప్టెక్స్ నిర్మాణ ప‌నుల‌ను ,11గంట‌ల‌కు కేపీహెచ్‌బీ 6వ ఫేజ్‌లో రూ. 141 కోట్ల‌తో చేప‌ట్టిన నాలా విస్త‌ర‌ణ ప‌నుల‌ను ప్రారంభిస్తారు. ఉద‌యం 11:20 గంట‌ల‌కు అల్లాపూర్‌లో రూ.73 ల‌క్ష‌ల‌తో చేపట్టే నాలా విస్త‌ర‌ణ ప‌నుల‌ను శంకుస్థాప‌న చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *