బాక్సింగ్ డే టెస్టులో భార‌త బౌల‌ర్లు విజృంభిస్తున్నారు…

మెల్ బోర్న్ః బాక్సింగ్ డే టెస్టులో భార‌త బౌల‌ర్లు విజృంభిస్తున్నారు. మెల్‌బోర్న్‌లో జ‌రుగుతున్న రెండో టెస్టులో భార‌త బౌల‌ర్లు క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్‌తో ఆసిస్ బ్యాట్స్ మెన్‌ను క‌ట్ట‌డి చేస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ 38 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్ వేసిన బుమ్రా మెయిడెన్‌తో త‌న కోటాను ప్రారంభించాడు. బుమ్రా త‌న రెండో మూడో ఓవ‌ర్‌లో ఓపెన‌ర్ జోబ‌ర్న్‌ను ఔట్ చేశాడు. దీంతో 10 ప‌రుగుల వ‌ద్ద ఆసిస్‌తొలి వికెట్ కోల్పోయింది. అనంత‌రం బ్యాటింగ్‌కు వ‌చ్చిన ల‌బుషేన్ జ‌గ్ర‌త్తగా ఆడుతున్నాడు. జ‌ట్టు స్కోరు 35 ర‌న్స్ వ‌ద్ద ఉండ‌గా మాథ్యూవేడ్ రూపంలో రెండో వికెట్ను కోల్పోయింది. ఈ వికెట్‌తో భార‌త బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ త‌న వికెట్ల ఖాతాను తెరిచాడు. మూడు ప‌రుగుల వ్య‌వ‌ధిలోనే ఆసిస్ త‌న మూడో వికెట్ను కోల్పోయింది. ఇన్నింగ్స్‌14వ ఓవ‌ర్‌వేసిన అశ్విన్ 38ప‌రుగుల వ‌ద్ద స్టీవ్ స్మిత్‌ను అశ్విన్ డ‌కౌట్ చేశాడు. దీంతోప్ర‌స్తుతం 17 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఆస్ట్రేలియా స్కోరు మూడు వికెట్ల న‌ష్టానికి 40 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం ల‌బుషేన్ (8), ట్రావిస్ హేడ్ క్రీజ్ (0) లో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *