ఇద్ద‌రి ఆట‌గాళ్ళ మ‌ధ్య మాట‌ల యుద్ధం…

maxwellresponds,to,sehwags,10crore,cheerleaderన్యూఢిల్లిః టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎంత స‌ర‌ద‌గా ఉంటాడో… అత‌డి విమ‌ర్శ‌లు అంత షూటుగా ఉంటాయి. త‌ర‌చూ విఫ‌ల‌మ‌య్యే ప్లేయ‌ర్స్‌పై వీరూ చేసే కామెంట్స్‌..వార్త‌ల్లో నిలుస్తూ ఉంటాయి. అయితే తాజాగా కాంగ్స్ పంజాబ్‌, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మ‌న్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై కాస్త డోసు పెంచి విమ‌ర్శ‌లు చేశాడు. ఐపీఎల్ సీజ‌న్ మొత్తంలో పంజాబ్ టీమ్ త‌ర‌పున‌13 మ్యాచ్‌లు ఆడిన మ్యాక్సీ.. కేవ‌లం 103 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దీంతో అత‌న్ని ఉద్దేశించి త‌న యూట్యూబ్ షో వీరూ కీ బైఠ‌క్‌లో సెహ్వాగ్ షూటైన విమ‌ర్శ‌లు చేశాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్‌. ఈ10 కోట్ల చీర్‌లీడ‌ర్ పంజాబ్‌కు చాలా న‌ష్టం చేశాడు. గ‌త కొన్నేళ్లుగా అత‌ని ఐపీఎల్ ఫామ్ దారుణంగానే ఉన్నా… ఈ సారి అన్ని రికార్డులు చెరిపేశాడు. అత‌నిది హైలీపెయిడ్ వెకేష‌న్ అని సెహ్వాగ్ విమ‌ర్శించాడు. అయితే దీనికి మ్యాక్స్‌వెల్ కూడా దీటుగానే రిప్లై ఇచ్చాడు. ఇలాంటి వాటితోనే అత‌డు ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తాడ‌ని మ్యాక్స్‌వెల్ అన్నాడు. వీరూ ఏది కావాలంటే అది మాట్లాడుకోవ‌చ్చ‌ని, అత‌ని విమ‌ర్శ‌ల‌ను తాను పెద్ద‌గా ప‌ట్టించుకోన‌నిస్ప‌ష్టం చేశాడు.నంబ‌ర్స్ ప‌రంగా ఈ సారి ఐపీఎల్‌.. మ్యాక్స్‌వెల్‌కు ఓ పీడ‌క‌ల‌గా చెప్పొచ్చు. మొత్తం టోర్నీలో అత‌ని అత్య‌ధిక స్కోరు 32 మాత్ర‌మే .ఒంటిచేత్తో కూడా సిక్స్‌లుకొట్టే సామ‌ర్థ్యం ఉన్న మ్యాక్స్‌వెల్. ఈసారి మొత్తం సీజ‌న్‌లో ఒక్క సిక్స‌ర్ కూడా కొట్ట‌క‌పోవ‌డం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *