ఒక‌వైపు ఆట మ‌రో వైపు పుస్త‌కం……

ఢిల్లీ: బాక‌ర్ ఒక‌వైపు చ‌దువుకుంటూనే మ‌రోవైపు సాధ‌న చేస్తుంది. ప‌రీక్ష‌లు జ‌రిగే స‌మ‌యంలో త‌న‌కు పోటీలు లేక‌పోవ‌డంతో రెండింటిని స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు సాగాల‌నేది ఆమె ఆలోచ‌న ఇప్పుడు మ‌ను.. ఢిల్లీ యూనివ‌ర్సిటీలోనిశ్రీ‌రామ్ మ‌హిళా క‌ళాశాల‌లో బీఏ ఆన‌ర్స్ చ‌దువుతోంది. బాక‌ర్… ఆన్‌లైన్‌లో ప్ర‌శ్నాప‌త్రం ద్వారా ప‌రీక్ష‌లు రాసి ముబైల్ స్కాన‌ర్‌తో జ‌వాబు ప‌త్రాల‌ను తిరిగి క‌ళాశాల‌కు పంప‌నుంది.టోక్కో ఒలింపిక్స్ కోసం క్రొయేషియాలో సాధ‌న‌కు క‌దిలింది భార‌త షూటింగ్ బృందం .ఈ టీమ్‌లో ఒక అమ్మాయి మాత్ర‌మే త‌న పిస్ట‌ల్‌తో పాటు పుస్త‌కాల‌ను కూడా విమానం ఎక్కించింది. దీనికి కార‌ణం త్వ‌ర‌లో ఆమె ప‌రీక్ష‌లు రాయాల్సిరావ‌డ‌మే . ఒక‌వైపు ఆట‌కు ప్రాధాన్య‌త ఇస్తూనే చ‌దువుని వ‌ద‌ల‌ని ఆ షూట‌రే మ‌నుబాక‌ర్. టోక్యో ఒలింపిక్స్‌లో ప‌త‌కం సాధిస్తుంద‌న్న అంచ‌నాలున్న మ‌ను.. ఈ నెల‌18 న త‌న బీఏ నాలుగో సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు మొద‌లుపెట్ట‌బోతోంది. గ‌తంలోనూ ఇలా చేశా. నేను ప‌రీక్ష‌లు రాసే రోజుల్లో ఎలాంటి పోటీలు లేవు. ఒలింపిక్స్ ఉండ‌డంతో ఈ సంవ‌త్స‌రం చాలా కీల‌కం.దేశాన్ని గ‌ర్వించేలా ప్ర‌ద‌ర్శ‌న‌ చేయ‌డంపైనే దృష్టి సారించా… అని బాక‌ర్ చెప్పింది. యూత్ ఒలింపిక్స్‌స్వ‌ర్ణం గెలిచిమ‌ను.. ప్ర‌పంచ‌క‌ప్,కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లోనూ ప‌సిడి ప‌త‌కాలు సొంతం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *