మిథాలీరాజ్ కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రశంస‌లు….

న్యూఢిల్లీ: ఇండియా జ‌ట్టు క్రికెట్ సార‌థి మిథాలీరాజ్ అన్ని ఫార్మాట్ల‌లో 10,000 ప‌రుగులు పూర్తి చేసిన తొలి ఇండియా మ‌హిళ‌గా నిలిచినందుకు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆదివారం ప్ర‌శంసించారు. ఆమె విజ‌య క‌థ మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే కాకుండా పురుషుల‌కు కూడా ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌ని అన్నారు. నెల‌వారీ రేడియో కార్య‌క్ర‌మం మ‌న్‌కీబాత్75వ ఎపిసోడ్ ఆదివారం జ‌రిగింది. దీనిలో మిథాలీరాజ్ ప‌ట్టుద‌ల‌, దేశానికి అందించిన సేవ‌ల‌ను కొనియాడారు. అంత‌ర్జాతీయ మ‌హిళ‌ల క్రికెట్లో మిథాలీ రాజ్ ఈమ‌ధ్య‌కాలంలో 10,000 ప‌రుగులు పూర్తి చేసిన తొలి మ‌హిళ క్రికెట‌ర్‌గా నిలిచారు. వ‌న్డేల్లో 7,000 ప‌రుగులు చేసిన తొలి మ‌హిళా క్రికెట‌ర్‌గా కూడా ఘ‌న‌త‌కెక్కారు. ఈ మ‌ధ్య‌కాలంలో ద‌క్ష‌ణాఫ్రికా జ‌ట్టుతోజ‌రిగిన మ్యాచ్‌లో మిథాలీజ్‌10వేల ప‌రుగుల మైలురాయికి చేరుకున్న‌ది.రెండు రోజుల త‌రువాత జ‌రిగిన వ‌న్డేల్లో 7,000 ప‌రుగులు పూర్తి చేసిన తొలి మ‌హిళా క్రికెట‌ర్‌గా నిలిచిన త‌న కిరీటంలో మ‌రో క‌లికితురాయిని చేర్చుకున్న‌ది. మ‌హిళా క్రికెట్కు ఆమె చేసిన తోడ్పాటు అద్భుత‌మైన‌ది అని ప్ర‌ధాని మోదీ చెప్పారు. ఈ ఘ‌న‌త సాధించ‌నందుకు ఆమెకు అభినంద‌నులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *