మాల‌దాస‌రి క‌థ ..

విజ‌య‌నగ‌రం ప‌రిపాలిస్తున్న శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లు ర‌చించిన ఆముక్త మాల్య‌ద‌(దీనికే మ‌రో పేరు విష్ణుచిత్తియం అని అంటారు. ఆముక్త‌మాల్య‌ద ప్రబంధ‌ములోని క‌థ శ్రీ‌వ‌వ‌రాహ‌పురాణాంత‌ర్గ‌త‌ము. శ్రీ‌వ‌రాహ‌భూదేవి సంవాద‌ములో భ‌గ‌వ‌ద్గ‌న మాహాత్మ్య‌మ‌ను ప్ర‌తిపాదించు న‌లువ బ్ర‌హ్మ‌) నాలుగ‌వ స‌ర్గ‌లో చండాల బ్ర‌హ్మ‌ర‌క్ష‌స్సంవాద‌ము క‌థ గ‌ల‌దు. బ్ర‌హ్మ‌రాక్ష‌సుడు పూర్వ జ‌న్మ‌మున సోమ‌శ‌ర్మ‌య‌ను బ్ర‌హ్మ‌ణుడు. ఇత‌డు య‌జ్ఞ‌క‌ర్మ స‌మాప్తినొంద‌క‌ముందే శూల దోష‌ముచే దీక్షాదిన‌ముల‌లో మృతినొందెను. అత‌డు మాతంగుని (మాల‌దాస‌రి) ద‌య‌వ‌ల‌న ముక్తినొందెను. ఈ క‌థ‌ను గ్ర‌హించి రాయ‌లు ఏ సంబంధము లేకున్న‌ను క‌ల్పించి కొన్ని మార్పులు చేసి ఆముక్త‌మాల్య‌ద‌లో విశిష్టాద్వైత‌మ‌త సంప్ర‌దాయంబున యుక్తి చాతుర్య‌మును, జ్ఞాన సంపూర్ణిని కన‌బ‌ర‌చి మిక్క‌లి సొగ‌సుగా ర‌చించెను.మాల‌దాస‌రి చెప్ప‌రాని అన‌గా పంచ‌మ‌కుల‌మున పుట్టిన‌వాడు. ఇత‌డు ప్ర‌తిరోజు త‌న ప‌ల్లె నుంచి తిరుక్కురుంగుడియ‌ను దేవాల‌య‌మున‌కు వెళ్లేవాడు. నాభ‌క్తుడు.పూర్వము నేను వామ‌నావ‌తార‌మున నివ‌సించిన దివ్య‌దేశ‌మున‌కు మూడామ‌డ‌ల దూర‌మందొక ప‌ల్లెలో నివసించువాడు. జాముప్రొద్దున లేచి మంగ‌ళ‌కైశిక రాగ‌ము చేత‌మ‌మ్ము గాన‌ము చేయుచుండును. అత‌డుమాభ‌క్తుడు. మాకు వ‌ర్ణాశ్ర‌మాచార‌ముల యందు ప్రీతి కావున అది తెలుసుకొని, ఆధిక్య‌మున‌కు పోక‌, త‌న కులాచార‌మందే నిలిచి, నిర్మ‌ల హృద‌యుడైన ఆచండాల శ‌రీర సాంగ‌త్య‌మ‌నెడు మ‌సిగుడ్డ‌లో గ‌ట్టిన మాణిక్య‌మువ‌లె నున్న‌వాడు. అత‌ని వేష‌ధార‌ణ ఇట్లున్న‌ది. నూనె అంటితోలుచొక్క త‌ల‌కు క‌ట్టిన కుళ్లాయిఉన్న‌ది. శంఖ చ‌క్ర‌ముల‌పోలు చెవుల పొగులు, చేతిలో దీప‌స్తంభ‌మును, తోలు తిత్తియు, చేతిలో బాణ‌పు అమ్మును, బోడిబాణ‌ము, మెడ‌మీద మొగిలి ఆకుల గొడుగును, భ‌గ‌వ‌త్పాదుక‌యును, గుఱ్ఱ‌పు జూలువంటి వెండ్రుక‌లు గ‌ల‌వాడును, సొర‌కాయ‌దండెయును, (చిన్న‌వీణ‌) చిటి తాళ‌ములు, చంక‌లో భ‌వ‌నాసియు, ప‌రుగువేగ‌ము చేత ధ్వ‌నించే తుల‌సిపూస‌ల దండ‌ము మాసిన శ‌రీర‌మును, మ‌ట్టితో పెట్టిన తిరునామ‌మును, కైశిక‌పాడుతు, ఆడుతు నిద్ర‌లేక ఎర్ర‌బారిన కండ్లుగ‌ల వాడును, న‌డుముకు ప‌సుపునింపిన చిన్న‌తోలుసంచిలు క‌లిగి అల‌రారుచు ఆ మాల‌దారి భ‌గ‌వంతునిసేవ‌కై వ‌చ్చు చుండెను.దించి, భ‌క్తిచే గ‌గుర్పాటుగ‌ల‌వాడైజ,గాన‌రక్తి చేత పాషాణ‌ములు క‌రుగున‌ట్లు చాండాలిక‌య‌ను వీణ‌ను వాయించుచును, ఎండ‌ను, ఆక‌లిని, ద‌ప్పిక‌ను, గాలిని లెక్క‌చేయ‌క అస‌రాహ్ణ‌వేళ‌వ‌ర‌కు భ‌క్తి చేత‌,మంగ‌ళ‌కైశికిరాగ‌ము పాడుతూ నాట్య మాడుచుండును, ఇట్లు చాలాసేపు భ‌గ‌వంతుని గ‌డి ఎదుట న‌మ‌స్క‌రిస్తూ ఆడుచుండును, దేవుని గ‌ర్భ‌గృహము క‌డిగిన నీరులోప‌లి తొట్టినిండి బ‌ట‌య‌కు వ‌చ్చి రాతి దొట్టినిండి, ఆపై ఆనీరు కాలువ‌గా పాఱి దూర‌ములో మ‌డుగు క‌ట్టేది. ఆ రాతి దాట్టిలోని నీటిని ఒక శూద్రుని చేత తెప్పించుకొని త్రాగి ఉండువాడు. ఇట్లుండ‌గా శ్రేష్ఠ‌జాతివారు గుడిలోప‌లికి, బ‌య‌టికి వ‌చ్చిపోవున‌పుడు వారికి దూర‌ముగా తొల‌గిపోవుచుండెను. ఎండ‌కుగాలికి ఆడిపాడి అల‌సిపోనంత‌లో దేవుని ప్రసాద‌ము పంచిపెట్టేస‌మ‌య‌మువ‌చ్చేది. ఇంత‌లో నాలుగ‌వ జాతి శూద్ర‌జాతివాడు ఆనందించి, ద‌య ఉంచి ప్ర‌సాద‌మును మాల‌దారికి పెట్టును. దానిని తృప్తిగా భుజించి తీర్థ‌ము గ్ర‌హించువాడు. నికృష్ణ‌మ‌గు జీవిత‌ము గ‌డుపుతు నీచ‌భావ‌ము, క్లేశ‌ముగాను క‌నిపించును గుడివ‌ద్ద చూసిన‌వారు క‌నిక‌రింతురు.దేవాల‌యం బ‌య‌ట ప‌లుక‌రాళ్ల‌కు అవ‌త‌ల నిలుచుండి, ప్రాకార‌మున‌గావ‌ల‌నే ప్ర‌ద‌క్ష‌ణ‌ము చేసుకొని, ప్రొద్దుపోగానే, త‌న ఊరుకు చేరువాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *