లాక్ డౌన్ జూన్ 1 వ‌ర‌కు పొడిగించిన మ‌హారాష్ట్రప్ర‌భుత్వం…

ముంబ‌యి: ఇప్పుడు కొవిడ్ సెకండ్ వేవ్ విప‌రీతంగా రెచ్చిపోతుంది.గ‌త ఏడాది నుండి క‌రోనా ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విష‌యం తెలిసిందే.ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర ..ఇప్ప‌టికే విధించిన లాక్‌డౌన్ త‌ర‌హా ఆంక్ష‌ల‌ను పొడిగించింది. జూన్ 1వ తేదీ ఉద‌యం ఏడు గంట‌ల వ‌ర‌కు ఈ క‌ఠిన చ‌ర్య‌లు అమ‌ల్లో ఉంటాయి. అలాగే రాష్ట్రంలోకి ప్ర‌వేశించేవారి వెంట క‌రోనా నెగెటివ్ రిపోర్టు తప్ప‌నిస‌రి అని సృష్టం చేసింది. కొవిడ్ తీవ్ర‌త అధికంగా ఉన్న ప్రాంతాల నుండి వ‌చ్చే వారిపై ఆంక్ష‌లు త‌ప్ప‌వ‌ని తెలిపింది. అంతేకాకుండా అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు సంబంధించి స‌డ‌లింపుల‌ను కొత్త ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉండ‌గా.. 24గంట వ్య‌వ‌ధిలో మ‌హారాష్ట్రలో46,781 మందికి కొవిడ్ సోకింది. 816 మంది ప్రాణాలు వ‌దిలారు. అయితే, తాజాగ కేసుల కంటే రిక‌వ‌రీలు (58,805) ఎక్కువ‌గా ఉండ‌టం ఆ రాష్ట్రానికి ఒకింత ఊర‌ట‌నిచ్చే అంశం. మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా 3.6ల‌క్ష‌ల మంది కొవిడ్ బారిన ప‌డ‌గా.. నాలుగువేల‌కు పైగా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. రెండో రోజు నాలుగువేల మందికి పైగా మృత్యుఒడిన చేరుకోవ‌డం ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *