మ‌హారాష్ట్రంలో క‌రోనా విజృంభ‌ణ – ఒకే స్కూళ్లో 229 కేసులు న‌మోదు

ముంబై: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల జీవితాల‌ను ఆర్థికంగా దెబ్బ‌తీసింది అంద‌రికి తెలిసిన విష‌య‌మే.రోజు రోజుకు క‌రోనా విజృంభిస్తోంది. మ‌హారాష్ట్రంలో క‌రోనా విల‌తాడ‌వం చేస్తోంది.అక్క‌డి వాషిమ్ జిల్లాలోని ఓ స్కూల్ హాస్ట‌ల్‌లో ఏకంగా 229 మంది విద్యార్థులు, ముగ్గురు సిబ్బంది క‌రోనా బారిన పడ్డారు. దీంతో స్కూల్ ప‌రిసరాల‌ను కంటైన్మెంట్ జోన్‌గా ప్ర‌కటించారు. ఈ విధ్యార్థుల‌లో చాలా వ‌ర‌కు క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న అమ‌రావ‌తి, యావ‌త్మ‌ల్ జిల్లాల‌కు చెందిన వాళ్లే కావ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల కాలంలో ఈరెండు జిల్లాల్లో క‌రోనా తీవ్ర‌త చాలా ఎక్కువ‌గా ఉంది. అటురాష్ట్రం మొత్తంలోనూ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరిగింది. గ‌డిచిన‌24 గంట‌ల్లోనే మ‌హారాష్ట్రంలో మొత్తం 8 వేల కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం, ముంబై మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ హెచ్చ‌రిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *