మ‌హారాష్ట్రాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా ….

ముంబై : క‌రోనా మ‌హ‌మ్మారి మ‌హారాష్ట్రను వ‌ణికిస్తోంది. రాష్ట్రంలో అహ్మ‌ద్‌న‌గ‌ర్ జిల్లాలో 8వేల మందికిపైగా చిన్నారులు కొవిడ్ బారిన‌ప‌డ‌డంతో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇది క‌రోనా థ‌ర్డ్ వేవేనంటూ ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి కోర‌లు చాచి చిన్నారుల‌ను చిత్ర‌హింస‌లు చేస్తుంది.క‌రోనా బారిన‌ప‌డిన చిన్నారుల‌కు చికిత్స అందించేందుకు సాంగ్లిలో ప్ర‌త్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. మే నెల‌లో 8వేల మంది చిన్నారులు కరోనా బారిన‌ప‌డ్డార‌ని, ఇది చాలా ఆందోళ‌న క‌లిగిస్తోందని అహ్మ‌ద్‌న‌గ‌ర్ జిల్లా చీఫ్ రాజేంద్ర భోస‌లే పేర్కొన్నారు. కాగా, ఆగ‌స్టు -సెప్టెంబ‌రులో రాష్ట్రంలో థ‌ర్డ్‌వేవ్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న నిపుణుల హెచ్చ‌రిక‌ల‌తో మ‌హారాష్ట్ర స‌హా ఇత‌ర రాష్ట్రాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. వారి కోసం ప్ర‌త్యేకంగా కొవిడ్ వార్డులు ఏర్పాటు చేస్తున్నాయ‌.ఇందులో భాగంగా మ‌హారాష్ట్ర స‌ర్కారు సాంగ్లిలో ఓవార్డు ఏర్పాటు చేసింది. సెకండ్ వేవ్ లో బెడ్లు, ఆక్సిజ‌న్ వంటి వాటికి తీవ్ర కొర‌త ఏర్ప‌డిన సంద‌ర్బంలో థ‌ర్డ్‌వేవ్‌లో అలాంటి ప‌రిస్థితి రాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్న‌ట్టు ఎమ్మెల్యే సంగ్రామ్ జ‌గ‌తప్ పేర్కొన్నారు. థ‌ర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు పూర్తి సిద్ధంగా ఉన్న‌ట్టు చెప్పారు. క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఎప్పుడు, ఏ తేదీలో వ‌స్తుందో తెలియ‌దు. కాబ‌ట్టి దానిని ఎదుర్కొనేందుకు పూర్తి స‌న్న‌ద్దంగా ఉన్న‌ట్టు సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే తెలిపారు.ఇప్పుడు రాష్ట్రంలో అమ‌ల్లో ఉన్న ఆంక్ష‌ల‌ను జూన్ 15 వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్టు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *