మ‌హారాష్ట్రం లో క‌రోనా మ‌హామ్మారి ఉగ్ర‌రూపం దాల్చింది…. ..

ముంబ‌యి: భార‌త‌దేశంలో క‌రోనా విజృంభించ‌టం త‌గ్గింది అంద‌రికి తెలిసిన విష‌య‌మే. కానీ మ‌హారాష్ట్రలో మాత్రం ప‌రిస్థితి అదుపుకావ‌ట్లేదు. స‌రిక‌దా.. వైర‌స్ కేసులు మ‌ళ్లీ పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. క‌రోనా మ‌హమ్మారి సామాన్య ప్ర‌జ‌ల‌ను ప‌ట్టిపిడిస్తుంది.వ‌రుస‌గా ఐదో రోజు… రోజువారీ కేసుల సంఖ్య పెర‌గ‌డ‌మేగాక‌, దాదాపు నెల రోజుల త‌రువాత కొత్త కేసులు పెర‌గ‌డ‌మేగాక‌, దాదాపు నెల‌రోజుల త‌రువాత కొత్త కేసులు మ‌రోసారి 4 వేల‌పైకి చేరాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా మ‌రో 4,092 కొవిడ్ కేసులు బ‌య‌ట‌ప‌డిన‌ట్లు మ‌హారాష్ట్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య కొత్త‌గా 20,64,278కి చేరింది. చివ‌రిసారిగా ఈ సంవ‌త్స‌రం జ‌న‌వ‌రి 6న మ‌హారాష్ట్రంలో 4,382 తాజా కేసులు న‌మోద‌య్యాయి. ఆ త‌రువాత మ‌ళ్లీ ఆదివారమే కేసుల సంఖ్య 4 వేల‌ను దాటింది. ఒక్క ముంబ‌యిలోనే 645 వైర‌స్ కేసులు వెలుగుచూశాయి. దేశ వాణిజ్య రాజ‌ధాని అయిన ముంబయిలో ఇప్ప‌టి వ‌ర‌కు 3,14,076 మంది కొవిడ్ బారిగా ప‌డ‌గా..11,419 మంది మ‌ర‌ణించారు. నిన్న మ‌రో 1,355 మంది వైర‌స్ నుంచి కోలుకోగా.. మొత్తం రిక‌వరీల సంఖ్య 19,75,603గా ఉంది. ఇప్పుడు మ‌హారాష్ట్రంలో 35,965 యాక్టివ్ కేసులున్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో మ‌రో 40 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 51,529 మంది వైర‌స్‌కు బ‌ల‌య్యారు. రాష్ట్రంలో వైర‌స్ వ్యాప్తి పెరుగుతున్న నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌భుత్వం
ఈమ‌ధ్యకాలంలో కొన్ని ఆంక్ష‌లు తీసుకొచ్చింది. క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉన్న మ‌రో రాష్ట్రం కేర‌ళ నుంచి మ‌హారాష్ట్రకు వ‌వ‌చ్చేవారికి ఆర్‌టీ-పీసీఆర్ ప‌రీక్ష త‌ప్ప‌నిస‌రి చేసింది. ఇక దీ్ల్లీ,గోవా, గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌ల నుంచి వ‌చ్చే వారు కూడా త‌మ ప్ర‌యాణానికి 72 గంట‌ల ముందు క‌రోనా ప‌రీక్ష చేయించుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *