రాష్ట్రంలో 18నుండి 44 సంవ‌త్స‌రాల వారంద‌రికీ ఉచిత వ్యాక్సిన్..

ముంబై: ఇప్పుడు కొవిడ్ సెకండ్ వేవ్ చాలా విరీతంగా విజృభిస్తోంది. ప్ర‌జ‌లు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని జీవ‌నం సాగిస్తున్నారు. మ‌హారాష్ట్ర స‌ర్కారు బుధవారం ప్ర‌క‌టించింది. ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్‌థాక‌రే అధ్య‌క్ష‌త‌న ఈరోజు జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు సీఎం కార్యాల‌యం ఒక ట్వీట్ లో తెలిసింది. కేబినేట్ స‌మావేశానంత‌రం ముఖ్య‌మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 18నుండి 44 సంవ‌త్స‌రాల వారంద‌రికీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. వ్యాక్సినేష‌న్ ప్రొగ్రాం కోసం ఆరోగ్య శాఖ ప్లానింగ్ చేస్తోంద‌ని ,ముందుగానే పౌరుల‌కు ఈ సంగ‌తి తెలియ‌జేస్తున్నామ‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. వ్యాక్సినేష‌న్ మొద‌లుపెట్టాం. ఇప్ప‌టి వ‌ర‌కూ 45 సంవ‌త్స‌రాల లోపు వాళ్లు 1.5 కోట్ల‌మంది వ్యాక్సినేష‌న్ వేయించుకున్నారు. దేశంలోనే ఇదొక రికార్డు అని థాక‌రే అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్న‌ప్ప‌టికీ పౌరులంద‌రి ఆరోగ్యానికి అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని, ఆ కార‌ణంగానే 18 నుండి 44 ఏళ్ల లోపు వ‌య‌సున్న ప్ర‌తి ఒక్క‌రికి ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాల‌ని మంత్రివ‌ర్గ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకున్నామ‌ని సీఎం చెప్పారు. ఇప్పుడు సిరం, భార‌త్ బ‌యోటెక్ వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయ‌ని, వ్యాక్సిన్ ప్లానింగ్ కోసం ఆ రెండు కంపెనీల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌ని తెలిపారు. నిర్దేశించిన ఏజ్ గ్రూప్‌వారు కోవిన్ మొబైల్ యాప్‌లో త‌మ పేర్లు రిజిస్ట‌ర్ చేయించుకోవాల‌ని, వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల‌కు క్యూలు క‌ట్ట‌వ‌ద్ద‌ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *