మంట‌మ‌డుతున్న వంట‌గ్యాస్ -ఎల్‌పీజీ వినియోగం

హైద‌రాబాద్‌:దేశంలో నిత్య‌వ‌స‌ర ధ‌ర‌లు రోజురోజు కు పెరుగుతున్నాయి,దానికి తోడు గ్యాస్ ధ‌ర పెరుగుతుంది. ధ‌ర‌ల పెరుగుద‌ల ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన మంత్రి ఉజ్వ‌ల యోజ‌న (పీఎంయువై) క‌స్ట‌మ‌ర్ల‌లో ఎల్ పీజీ వినియోగం 23.2శాతం పెరిగింద‌ని భార‌త్ ఆయిల్ కార్పొరుష‌న్ లిమిటెడ్ (ఐఓసీఎల్‌) నివేదిక‌లో తెలిపింది. గ‌తేడాది తో పోలీస్తే, మొత్తం దేశీయ ఎల్ పీజీ అమ్మ‌కాలు ఇప్పుడు ఆర్థిక సంవ‌త్స‌రంలో (ఫిబ్ర‌వ‌రి21వ‌రకు) 10.3శాతం వృద్ధిని న‌మోదు చేశాయ‌ని ఐఓసీఎల్ ప్ర‌క‌టించింది. ఎల్ పీజీ ధ‌ర‌లు ఈ మ‌ధ్య‌కాలంలో బాగా పెరిగిన్నటికీ, ప్ర‌ధాన మంత్రి ఉజ్వ‌ల యోజ‌న (పీఎంయువై) వినియోగ‌దారుల‌లో ద్ర‌వీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) సిలిండ‌ర్ల వినియోగం మెరుగుప‌డింది. ఐఓసీఎల్ నివేదిక ప్ర‌కారం ఈ ఆర్థిక ఏడాది ప్రారంభం త్రైమాసికంలో ఎల్పీజీ వినియోగంలో 23.2శాతం పెరుగుద‌ల ఉంది. దీనికి పీఎం యువై ల‌బ్దిదారుల‌కు ఇచ్చిన 3 ఉచిత ఎల్ పీజీ రీఫిల్స్ కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. కేంద్ర ప్ర‌భుత్వం పేద‌ల‌కు వంట గ్యాస్ అందుబాటులో ఉంచాల‌నే ఉద్దేశంతో ల‌బ్దిదారుల‌కు అంద‌జేసింది. అంతేకాకుండా కొవిడ్‌-19 స‌మయంలో అట్ట‌డుగు స్థాయిలో ఉన్న‌వారి స‌మ‌స్య‌ల‌ను గుర్తించి పీఎంయువై ల‌బ్దిదారుల‌కు 3 ఉచిత ఎల్ పీజీ రీఫిల్స్ అందించారు. మొత్తం రూ. 9,670 కోట్లు ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల‌కు నేరుగా బ‌దిలీ అయ్యాయి. లాక్ డౌన్ కాలంలో 8 కోట్ల మంది ల‌బ్దిదారులు ప్ర‌ధాన్ మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ యోజ‌న ద్వారా 13కోట్ల ఎల్ పీజీ సిలిండ‌ర్ల‌ను ఉచితంగా పొందారు. అయితే పీఎంయువై ల‌బ్దిదారుల‌తో 70శాతం మందే త‌న ఎల్ పీజీ సిలిండ‌ర్ల‌ను రీఫిల్ చేసుకుంటున్నారు. మిగ‌తావారు ఇంకా వంట‌కు బ‌య‌ట వ‌న‌రుల మీదే ఆధార‌ప‌డుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *