గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర పెంపు…..

హైద‌రాబాద్‌: సామాన్యుల‌కు చుక్క‌లు చూపిస్తున్న గ్యాస్ ధ‌ర‌.కేంద్ర‌ప్ర‌భుత్వం రోజురోజు నిత్య‌వ‌స‌రాల స‌ర‌కుల నుంచి అన్ని వ‌స్తువుల మీద ధ‌ర‌ల పెంపుతో మ‌ధ్య త‌ర‌గ‌తిపైతీవ్ర ప్ర‌భావం పడుతోంది.ముఖ్యంగా గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర పెంపు వ‌ల్ల చాలా మందికిపై ఎఫెక్ట్ ప‌డింది. గ‌త ఏడు సంవ‌త్స‌రాల కాలంలో ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర ఏకంగా రెట్టింపు అయ్యింది. ఇప్పుడు ఎల్ పీజీ సిలిండ‌ర్ ధ‌ర రూ.849 స‌మీపంలో ఉంది. అంటే మోదీ పాల‌న‌లో ప్ర‌జ‌ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డింద‌ని చెప్పుకోవ‌చ్చు. కేవ‌లం గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర మాత్ర‌మే కాకుండా పెట్రోల్,డీజిల్ ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి. సెంచ‌రీ ద‌గ్గ‌రిలో ఉన్నాయి. 2014 మార్చి 1న 14.2 కేజీల ఎల్ పీజీ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.410 వ‌ద్ద ఉండేది. ప్ర‌స్తుతం సిలిండ‌ర్ ధ‌ర రూ. 849 అంటే రెట్టింపు అయ్యింది. ఆయిల్ మినిస్ట‌ర్ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించాయి. లోన్ స‌భ‌లో లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు. అదే స‌మ‌యంలో గ్యాస్ సిలిండ‌ర్ స‌బ్సిడీ వ‌స్తోంద‌ని ధ‌ర కూడా త‌గ్గుతూనే వ‌చ్చింది. ఇప్పుడు ఎల్ సీజీ సిలిండర్ బుక్ చేసే వారికి నామమాత్ర‌పు స‌బ్సిడీ వ‌స్తోంద‌ని చెప్పుకోవ‌చ్చు. ఏదేమైనా మోడీ పాల‌న‌లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెంపు సహా ఎల్ పీజీ సిలిండ‌ర్ ధ‌ర పెరుగుద‌ల వ‌ల్ల సామాన్యుల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డింద‌ని చెప్పుకోవ‌చ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *