ఎల్ఐసీ ,ఐపీఓ వాటాదారుల‌కు ప‌దిశాతం వాట‌…..

న్యూఢిల్లీ: ఈ ఐపీఓలో ఎల్ఐసీ పాల‌సీదారుల‌కు ప‌దిశాతం వాటాల‌ను కేటాయించాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తోంది. ఎల్ఐసీ ఐపీఓలో పాల‌సీదారుల‌కు కొన్ని షేర్ల‌ను రిజర్వ్ చేయాల‌ని చ‌ట్టంలో పొందుప‌రిచామ‌ని, పాల‌సిదారులు వాటాదారుల‌య్యే అవ‌కాశం క‌ల్పించామ‌ని పెట్టుబ‌డులు, ప్ర‌భుత్వ ఆస్తుల నిర్వ‌హ‌ణ శాఖ (డీఐపీఏఎం) కార్య‌ద‌ర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. ఎల్ఐసీ ఐసీఓలో ప‌దిశాతం పాలసీదారుల‌కు కేటాయించ‌వ‌చ్చని ఆయ‌న వెల్ల‌డించారు. ఎల్ఐసీ ఐపీఓకు వ‌చ్చే ఆర్థిక ఏడాదిలో ప్ర‌భుత్వం గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. 2022 లో పెట్టుబడుల ఉప‌సంహ‌ర‌ణ ద్వారా రూ.1.75 ల‌క్ష‌ల కోట్లు స‌మీక‌రించాల‌ని ప్ర‌భుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్న క్ర‌మంలో త‌దుప‌రి సంవ‌త్స‌రం ఎల్ఐసీ ఐపీఓ జారీ అవుతుంద‌ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఈమ‌ధ్య కాలంలో బ‌డ్జెట్ ప్ర‌సంగంలో పేర్కొన్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు కొవిడ్‌-19 మ‌హ‌మ్మారితో గ‌త సంవ‌త్స‌రం డిజిన్వెస్ట్‌మెంట్ ల‌క్ష్యాన్ని చేరుకోలేద‌ని పాండే పేర్కొన్నారు. రెండు ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, ఓ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రైవేటిక‌రిస్తామ‌ని, వ‌చ్చే ఆర్థిక ఏడాదిలో ఎల్ఐసీ స్టాక్ మార్కెట్ల‌లో లిస్ట‌వుతుంద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *