హ‌నుమ విహారి ని మంత్రి కేటీఆర్ శాలువాతో స‌న్మానించారు

హైద‌రాబాద్‌: టీమ్ఇండియా బ్యాట్స్‌మ‌న్ హ‌నుమ విహారి సోమ‌వారం తెలంగాణ ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశాడు. ఆసీస్ గ‌డ్డ‌పై చిరస్మర‌ణీయ ప్ర‌ద‌ర్శ‌న చేసిన విహారిని మంత్రి కేటీఆర్ శాలువాతో స‌న్మానించారు. ఆసీస్ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన విష‌యాల‌ను విహారీ.. కేటీఆర్‌కు వివ‌రించారు. మిమ్మ‌ల్ని క‌ల‌వ‌డం, క్రికెట్ గురించి సంభాషించడం చాలా ఆనందంగా ఉంద‌ని విహారి ట్విట‌ర్లో పేర్కొన్నాడు. కేటీఆర్ తో దిగిన ఫొటోను తెలుగు క్రికెట‌ర్ షేర్ చేశాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో అద్బుత డిఫెన్స్‌తో ఆక‌ట్టుకున్న హ‌నుమ విహారి, ర‌విచంద్ర‌న్ అశ్విన్ మ్యాచ్ డ్రాగా ముగియ‌డంలో కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. తొడ‌కండ‌రాల గాయం కార‌ణంగా విహారి ఆఖ‌రిదైన నాలుగో టెస్టుకు దూరంకావ‌డంతో ఇటీవ‌ల స్వ‌దేశం చేరుకున్నాడు. మూడో టెస్టును టీమ్ ఇండియా డ్రాచేసుకోవ‌డంపై మంత్రి కేటీఆర్ ట్విట‌ర్‌లో స్పందించిన సంగ‌తి తెలిసిందే. టెస్టు డ్రా… ఇన్నింగ్స్ విజ‌యం క‌న్నా బాగుంద‌ని ప్ర‌శంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *