కృష్ణంరాజుగారికి అరుదైన గౌర‌వం..

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజుగారికి అరుదైన గౌర‌వం ద‌క్క‌నుంది. ఆయ‌న్ను త‌మిళ‌నాడు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈమేర‌కు మీడియాలో వార్త‌లు జోరుగా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అయితే ఈవిష‌య‌మై అధికారిక స‌మాచారం ఇంకా వెలువ‌డాల్సిఉంది. కృష్ణంరాజుగారు ఎప్ప‌టి నుంచో గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి మీద ఆశ‌తో ఉన్నారు. ఎంతో హుందాగా ఉండే ఆ ప‌ద‌వి ద‌క్కితే బాగుంటుంద‌ని భావించేవారు. ఆయ‌న క‌ల ఇన్నాళ్ల‌కు నెర‌వేర‌బోతోంది. మూవీల నుండి రాజ‌కీయాల్లోకి టర్న్ త‌సుకున్న కృష్ణంరాజుగారు మొద‌ట కాంగ్రెస్ పార్టీలో చేరి కొద్దికాలానికే బీజేపీలోకి ప్ర‌వేశించారు. 1998 లో బీజేపీ నుండి కాకినాడ లోక్ స‌భ స్థానంలో పోటీ చేసి 1,65,000 భారీ మెజారిటీతో గెలుపొంది రికార్డ్ నెల‌కొల్పారు. 1999 లో వ‌చ్చిన స‌హాయ మంత్రిగా ఎన్నిక‌ల్లో కూడా కాకినాడ ఎంపీగా గెలిచాఉ. అట‌ల్ బిహారీ వాజ్పాయి నేతృత్వంలో కేంద్ర స‌హాయ మంత్రింగా కూడా ప‌నిచేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పెట్టిన‌పుడు అందులోకి వెళ్లిన రెబ‌ల్ స్టా ర్ మ‌ళ్లీ తిరిగి బీజేపీ గూటికే చేరుకున్నారు. అప్ప‌టి నుండి బీజేపీతోనే సాగుతూ కేంద్ర నాయ‌కుల‌కు స‌న్నిహితుల‌య్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *