‌14నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో అవార్డు ప్ర‌ధాన కార్యక్ర‌మం…

అమ‌రావ‌తి: ఏపీముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎలాంటి కుట్ర‌లు కుత్రంత‌లు లేకుండా వాలంటీర్లు కులాలు, మ‌తాలు చూడ‌కుండా నిస్వార్థంగా ప‌ని చేస్తున్నార‌న్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అమ‌ల్లోకి తీసుకొచ్చిన వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌లో భాగంగా ఉత్త‌మ సేవ‌లందించిన వారిని స‌త్క‌రించే కార్య‌క్రామానికి జ‌గ‌న్ ఈరోజుశ్రీ‌కారం చుట్టారు. కృష్ణాజిల్లా పెన‌మ‌లూరు మండ‌లం పోరంకిలో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఉత్త‌మ సేవ‌లు అందించిన గ్రామ‌, వార్డు వాలంటీర్ల‌కు సేవామిత్ర‌, సేవార‌త్న‌, సేవావజ్ర అవార్డుల‌ను సీఎం అంద‌జేశారు. ఈ నేప‌థ్యంలో సీఎం మాట్లాడుతూ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను రాష్ట్రంలో గ్రామ‌గ్రామాన వాలంటీర్లు సంధానక‌ర్త‌లుగా ఉన్నారు. ప్ర‌తి 50 ఇళ్ల‌కు ఒక వాలంట‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. వాలంటీర్ల‌లో 53శాతం మంది మ‌హిళ‌లే ఉన్నారు. దాదాపు 20 నెల‌ల క్రితం వాలంటీర్ల వ్య‌వ‌స్థ‌ను తీసుకొచ్చాం. వాలంటీర్ల త‌రువాత స‌చివాల‌య వ్య‌వ‌స్థ అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ వ్య‌వ‌స్థ ద్వారా రాష్ట్రంలో ప‌రిపాల‌న అంటే ఏంటోచూపించ‌గ‌లిగాం. వాలంటీర్లు విమ‌ర్శల‌కు బెద‌ర‌కుండా ప‌ని చేయాలి. వారికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంది. ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నిజిల్లాల్లో అవార్డు ప్ర‌ధాన కార్య‌క్ర‌మం చేప‌డుతున్నాం. అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *