న‌గ‌రం న‌డిబొడ్డున అంబేద్క‌ర్ విగ్ర‌హం- కొప్పుల ఈశ్వ‌ర్‌…

హైద‌రాబాద్‌: పెదప్ర‌జ‌ల పెన్నిది రాజ్యాంగ నిర్మాత భార‌త‌రత్న డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని హైద‌రాబాద్‌న‌గ‌రం న‌డిబొడ్డున 125 అడుగుల‌తో ఏర్పాటు చేస్తున్నామ‌ని సంక్షేమ‌శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ తెలిపారు. అంబేద్క‌ర్ విగ్ర‌హం ఏర్పాటుపై కొత్త‌గా క‌డుతున్న సచివాల‌యం స‌మీపాన 11.4 ఎక‌రాల్లో గొప్ప‌గా ఏర్పాటు చేయాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యం మేర‌కు అధికారుల‌తో గురువారం స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సచివాల‌యం స‌మీపాన‌11.4 ఎక‌రాల్లో కొత్త‌గా నిర్మిస్తున్న అంబేద్క‌ర్ విగ్ర‌హాల్లో దేశంలోనే అతి పెద్ద‌గా పేర్కొన్నారు. అంబేద్క‌ర్ విగ్ర‌హం నిర్వాణంతో బాగ్య‌న‌గరానికి మ‌రింత శోభ పెరుగుతుంది. హైద‌రాబాద్ న‌గ‌రం పేరు ప్ర‌ఖ్యాత‌లు, ప్ర‌తిష్ట మరింత పెరుగుతుంద‌న్నారు. దేశ విదేశాల‌కు చెందిన ప‌ర్యాట‌కులు త‌ర‌లివ‌స్తారు. అంబేద్క‌ర్ విగ్ర‌హం ఏర్పాటును సీఎం కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అంబేద్క‌ర్ స్పూర్తితో బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల ఉన్న‌తికి సీఎం చిత్త‌శుద్దితో పాటుప‌డుతున్నారు. మార్చిలో టెండ‌ర్లు పిలిచి, వచ్చేసంవ‌త్స‌రానికి మార్చికి పూర్తి చేస్తామ‌న్నారు. దీనిని దేశం అబ్బుర‌ప‌డే విధంగా ఏర్పాటు చేస్తామ‌ని ,ప‌రిస‌రాల‌ను ప‌చ్చ‌ద‌నంతో ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దుతామన్నారు. 50 అడుగుల ఎత్తులో పార్లమెంట్ను పోలిన పీఠం నిర్మించి,దానిపై 125 అడుగుల విగ్ర‌హాన్ని నిలుపుతామ‌ని కొప్పుల వివ‌రించారు. ఇందులో మ్యూజియం ,ఆర్ట్‌గ్యాల‌రి ,ఎగ్జిబిష‌న్‌, గ్రంథాల‌యం, ధ్యాన‌మందిరం, అంబేద్క‌ర్ జీవిత విశేషాల‌తో రూపొందించిన లేజ‌ర్ షో, క్యాంటీన్‌, వాష్ రూంలు, సువిశాల‌మైన పార్కింగ్ త‌దిత‌ర ఏర్పాటు ఉంటాయ‌ని మంత్రి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *