ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ రెండో రిపోర్ట్ కోసం ఎదురుస్తున్నారు….

అహ్మ‌దాబాద్‌: ఇప్పుడు దేశంలో ఎక్క‌డ చూసిన క‌రోనా మ‌హ్మామారి విజృభిస్తోంది.క్రికెట్ల‌ను సైతం విడిచిపెట్ట‌లేదు. 2021 ఐపీఎల్ 14వ‌సీజ‌న్‌లో కొవిడ్ క‌ల‌క‌లం రేపింది. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్‌కు చెందిన వ‌రుణ్‌చ‌క్ర‌వ‌ర్తి , సందీప్ వారియ‌ర్‌ల‌కు కొవిడ్ సోకింది. దీంతో సోమ‌వారం రాత్రి రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేయ‌నున్నారు. ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ పాజిటివ్‌గా తేలిన సంగ‌తి తెలియ‌డంతో ఆర్స‌బీ ఈ మ్యాచ్ ఆడ‌టానికి సుముఖంగా లేద‌ని బీసీసీఐ అధికారి ఒక‌రు ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ ఏన్ ఐకి వెల్ల‌డించారు. ఈ మ్యాచ్‌ను వాయిదా వేయ‌నున్న‌ట్లు చెప్పారు. అయితే ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ రెండో రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నామ‌ని ఆ అధికారి తెలిపారు. దీనిపై త‌ర్వ‌లోనే బీసీసీఐ అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసే అవకాశం ఉంది. లీగ్‌ప్రారంభానికి ముందు కూడా ఢీల్లీ ప్లేయ‌ర్ అక్ష‌ర్ ప‌టేల్‌, ఇదే నైట్ రైడ‌ర్స్‌కు చెందిన స‌తీష్ రాణా కూడా క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో కూడా ప‌లువురు గ్రౌండ్ సిబ్బందికి కొవిడ్ సోకింది. అయితే టోర్నీకి ముందే ప్లేయ‌ర్స్‌కు నెగ‌టివ్‌గా తేల‌డంతో లీగ్ స‌జావుగా సాగుతోంది. ఇప్పుడు ప్లేయ‌ర్స్ అంతా క‌ఠిన‌మైన బ‌యోబ‌బుల్ ఉంటున్నారు. అయితే ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ త‌మ గాయాల‌ను స్కానింగ్ కోసం వెళ్లిన‌ప్పుడు కొవిడ్ బారిన ప‌డి ఉంటారని అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *