ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాల‌ను స‌వాల్ – హైకోర్టులో కేసును దాఖాలు చేసిన నాని..

హైద‌రాబాద్: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రాజ‌కీయం రోజు రోజుకి వెడేక్కిపోతుంది. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ మంత్రి కొడాలి నానిపై చ‌ర్య‌లు తీసుకున్న విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నిక‌లు ముగిసే వ‌ర‌కు కొడాలి నాని మీడియా, స‌మావేశాల్లో మాట్లాడొద్ద‌ని ఆదేశాలు జారీ చేసింది. ఎస్ ఈసీ ఇచ్చిన ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ నేడు మంత్రి కొడాలి నాని హైకోర్టులో కేసును దాఖ‌లు చేస్తున్నారు. ఇప్పుడు కోర్టుకు సెల‌వులు ఉండ‌టంతో హౌస్ మోహ‌న్ పిటీష‌న్ దాఖ‌క‌లు చేయాల‌ని మంత్రి నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్య‌మంత్రి ప‌త‌కాన్ని ఎస్ఈసీ కోరుతుందంటూ మంత్రి కొడాలి నాని కామెంట్లు చేయ‌డంతో ఎస్ఈసీ ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకుంది. రాష్ట్రాధినేత‌గా సీఎం మీద క‌మిష‌న్‌కు సంపూర్ణ గౌర‌వం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్నిల‌య్యేంత వ‌ర‌కు మీడియాతో మాట్లాడే అంశంలో నిగ్ర‌హం పాటించాలంటూ కొడాలిని ఆదేశించింది. ఎస్ఈసీ.. స‌మావేశాల్లోనూ సంయ‌మ‌నం పాటించాల‌ని ఆంక్ష‌లు విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *