కేళ‌ర అసెంబ్లీ చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్య‌య‌నం- ఒకే సారి మామ,అల్లుళ్లు

హైద‌రాబాద్‌: కేర‌ళ లో మామ‌, అల్లుళ్లు క‌లిసి అసెంబ్లీలోకి త్వ‌ర‌లో అడుగుపెట్ట‌నున్నారు. చ‌రిత్ర‌లో ఇది మొదటిసారి అనిచేప్ప‌వ‌చ్చు.ఆ మామ‌, అల్లుళ్లు ఎవ‌రో కాదు సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌, ఆయ‌న అల్లుడు పీ.ఎ. మొహ‌మ్మ‌ద్ రియాస్ . ఈమ‌ధ్య‌కాలంలో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌యన్‌(77) క‌న్నూర్ జిల్లా ధ‌ర్మ‌దామ్ నుండి, ఆయ‌న అల్లుడు రియాస్‌(44) కోజికోడ్ జిల్లా బేపోర్ నియోజ‌క‌వ‌ర్గం నుండి, ఎమ్మెల్యేలుగా గెలిచారు. విజ‌య‌న్ కూతురు వీణ‌, రియాస్ 2020 లో వివాహం చేసుకున్నారు. వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహం. వీణ బెంగ‌ళూరులో ఐటీ సంస్థ‌ను న‌డుపుతుండ‌గా రియాస్ డెమోక్ర‌టిక్ యూత్ ఫెడ‌రేష‌న్ నేష‌న‌ల్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. రియాస్ 2009 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో కోజికోడ్ నుండి బ‌రిలో దిగి ప‌రాజ‌యం పాల‌య్యారు. 2002 త‌రువాత కేర‌ళ అసెంబ్లీలో మ‌హిళ‌ల ప్రాతినిధ్యం తొలిసారి రెండంకెల‌కు చేరింది. ఈ మ‌ధ్య‌కాలంలో ఎన్నిక‌ల్లో అసెంబ్లీ లోని 140 స్థానాల‌కు 103 మంది మ‌హిళ‌లు బ‌రిలో నిల‌వ‌గా11 మంది మాత్రం విజ‌యం సాధించారు. వీరిలో 10 మంది అధికార ఎల్డీ ఎఫ్‌కు చెందిన వారు, ఒక్క‌రు మాత్ర‌మే ప్ర‌తిప‌క్ష యూడీఎఫ్ ఎమ్మెల్యే. ఆరోగ్య మంత్రి కేకే శైల‌జ 60 వేల ఓట్ల మెజారిటీతో మ‌త్త‌న్నూర్ నుండి గ్రాండ్ విక్ట‌రీ సాధించాడు. 2016 ఎన్నిక‌ల్లో 8మంది మాత్ర‌మే గెల‌వ‌గా, 1996లో 13 మంది మ‌హిళ‌లు అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు.: కేరళ అసెంబ్లీ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. మామ, అల్లుళ్లు కలిసి అసెంబ్లీలోకి త్వరలో అడుగుపెట్టనున్నారు. ఆ మామ, అల్లుళ్లు ఎవరో కాదు సీఎం పినరయి విజయన్, ఆయన అల్లుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *