కేర‌ళ రాజ‌ధాని లో రికార్డు సృష్టించిన 21 ఏళ్ల అమ్మాయి.

తిరువ‌నంత‌పురంః మేయ‌ర్ ఎన్నిక‌ల్లో కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురం రికార్డు సృష్టించింది.21 ఏళ్ల ఆర్యారాజేంద్ర‌న్ సోమ‌వారం తిరువ‌సంత‌పురం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్ గా ఎన్నిక‌య్యారు. డిగ్రీ రెండో ఏడాది చ‌దువుతున్న ఆర్య కుంటుబానికి ఎటువంటి రాజ‌కీయ చ‌రిత్ర లేదు. క‌మ్యూనిస్టు పార్టీ ఆధ్వ‌ర్యంలో న‌డిచే బాల సంఘంలో చేరిన ఆమె చిన్న‌త‌నంలోనే నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను పుణికి పుచ్చుకున్నారు. బాల సంఘానికి రాష్ట్ర అధ్య‌క్షురాలిగా చేశారు. అభివృద్ధికి బాట‌లు వేయాలంటే రాజ‌కీయాలే స‌రైన వేదిక‌ని ఆమె అభిప్రాయం. దానిలో భాగంగానే ఇటీవ‌ల జ‌రిగిన తిరువ‌సంత‌పురం కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోముద‌వ‌న్‌ముక‌ల్ వార్దుకు సీపీఎం అభ్య‌ర్థిగా పోటీ చేసి విజ‌యం సాధించారు. రెండు వేల‌కుపైగా ఓట్ల తేడాతో గెలుపును సొంతం చేసుకున్నారు. స‌మాజం ప‌ట్ల ఆమెకున్న అవ‌గాహ‌న‌కు గుర్తించిన పార్టీలు నేడు ఆమెను మేయ‌ర్ పీఠంపై కూర్చొబెట్టాయి. కొద్ది రోజుల క్రితం ఆమె మాట్లాడుతూ నేను మేయ‌ర్‌గా ఎన్నికైనా నా చ‌దువును కొన‌సాగిస్తాను, అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *