అమెరికా అధ్య‌క్షుడికి, ఉపాధ్యాక్షురాలికి మాస్కులు పంపిన క‌ర్ణాట‌క వాసి…

హైద‌రాబాద్: క‌ర్ణాట‌క‌లోని దావ‌ణ‌గెరెకు చెందిన వివేకానంద అనే వ్య‌క్తి అగ్ర‌రాజ్య అమెరికా అధ్య‌క్షుడుజో బైడెన్‌, ఉపాధ్యాక్షురాలు క‌మ‌లా హారిస్‌కు మాస్కులు పంపించారు. త‌నే స్వ‌యంగా మాస్కులకు త‌యారు చేశారు. మూడు పొర‌లున్న ఈ మాస్కులు అమెరికా చేరుకున్నాయి. గ‌త సంవ‌త్స‌రం నుండి వివేకానంద మాస్కులు త‌యారు చేయ‌డం మొద‌లు పెట్టారు.భార్య శాంతా, కూతురు కావ్య ఆయ‌న‌కు సాయం చేస్తున్నారు. వివేకానంద త‌యారు చేసిన కాషాయం, తెలుపు, ఆకుప‌చ్చ రంగుల‌తో కూడిన మాస్కులు ప్ర‌జ‌ల్ని విప‌రీతంగా ఆక‌ర్షించాయి. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ,రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ ,ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు, యూపీ సీఎం యోగి అదిత్య‌నాథ్‌కు కూడావివేకానంద మాస్కులు పంపించారు. వారి నుండి అభినంద‌న‌లూ అందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *