స‌హ‌నంతోనే ఇంగ్లాండ్‌లో ప‌రుగులు వ‌స్తాయి – క‌పిల్‌దేవ్‌

హైద‌రాబాద్‌: భార‌త్ జ‌ట్టు క్రికెట‌ర్ క‌పిల్‌దేవ్ ఐపీసీ ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్స్‌లో ఆచితూచిఅడుగు వేయాలన్నారు. ఇంగ్లాండ్‌లో వాతావ‌ర‌ణం నిమిషాల వ్య‌వ‌ధిలో మారుతుంద‌న్నారు. అందుకే ఒక్కో సెష‌న్ లక్ష్యంగా ముందుకు సాగాల‌ని తెలిపారు. అనుకున్న ల‌క్ష్యం చేదించేందుకు తెల‌వితో , సాంకేతికంగా మెరుగ్గా ఆడాల‌ని పేర్కొన్నారు. రిష‌బ్ పంత్‌లో ప‌రిణతి క‌నిపిస్తోందని వెల్ల‌డించారు. భార‌త్ జ‌ట్టు బ్యాటింగ్ విభాగం అద్భుతంగా ఉంది. ప‌రిస్థితుల‌ను ఎలా ఎదుర్కొంటారన్న‌దే కీల‌కం. నా వ‌ర‌కైతే కోహ్లీసేన బ్యాటింగే అతి ముఖ్య‌మైంది. ఈ మ‌ధ్య‌కాలంలో బౌల‌ర్లు తిరుగులేని విధంగా ఆడుతున్నారు. అందుకే బ్యాట్స్‌మెన్ నాణ్య‌త‌ను బ‌ట్టే ఫైన‌ల్ లో గెలుపోట‌ములు ఉంటాయి.టెస్టు క్రికెట్ అంటేనే సెష‌న్లు. ఇంగ్లాండ్‌లో నిమిషాల్లోనే ఎండ‌లు కాస్తున్న అకాశం మేఘావృతం అవుతుంది. అందుకేసాంకేతికంగా,వ్యూహాత్మ‌కంగా బాగా ఆడాలి, అని కపిల్ అన్నారు. కోహ్లీ రాణించాల‌ని కోరుకుంటున్నా.స‌హ‌జంగానే అతడు దేనికైనా అల‌వాటు ప‌డ‌తారు.అతి దూకుడు మాత్రం వ‌ద్దంటారు. ఒక్కోసెష‌న్‌ను బ‌ట్టి ఆదిలోనే షాట్లు ఆడొద్దు. స‌హ‌నంతోనే ఇంగ్లాండ్‌లో ప‌రుగులు వ‌స్తాయి. ఇక పంత్ క్రీజులో నిల‌దొక్కుకొని ముందుగా ప‌రిస్థితుల‌కు అల‌వాటు ప‌డాలి. ఆ త‌రువాతే దూకుడు ప్ర‌ద‌ర్శించాలి. రెండు,మూడు మ్యాచ్‌లు ఉంటే ఫైన‌ల్స్ కు మ‌రింత అర్థం ఉండేది. లార్డ్స్ లో నిర్వ‌హిస్తే బాగుండేది.
ఇప్పుడు ప‌రిస్థితుల్లో త‌ప్ప‌డం లేదు.అని క‌పిల్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *