త‌ర్వ‌లో బాంబే హైకోర్టును ఆశ్ర‌యించ‌నున్నా కంగ‌న ర‌నౌత్‌…

ముంబైఃబాలీవుడ్ క‌థానాయిక కంగ‌న ర‌నౌత్ త్వ‌ర‌లో బాంబే హైకోర్టును ఆశ్ర‌యించనున్నారు. ముంబైలో త‌న ఇంటి కూల్చివేత‌ను నిలిపివేయాల‌ని కోరుతూ ఆమె దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను స్థానిక (దిందోషి) న్యాయ‌స్థానం తోసిపుచ్చింది. ఈ విష‌యాన్ని కంగ‌న త‌ర‌పు న్యాయ‌వాది రిజ్వాన్ సిద్దిఖీ ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. తాత్కాలిక ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని డీబీ బ్రీజ్ బిల్డింగ్‌లోని ఇత‌ర నివాసుల‌తో క‌లిసినా క్ల‌యింట్ దాఖ‌లుచేసిన పిటిష‌న్‌ను దిందోషి కోర్టు కొట్టేసింది. ఈ అంశంపై బాంబే హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేస్తాం అని ట్వీట్ చేశారు. దిందోషి సివిల్ కోర్టు కొట్టివేసిన త‌మ పిటిష‌న్‌పై స్పందించ‌డానికి కంగ‌న‌ర‌నౌత్ గానీ, ఆమె త‌ర‌పు న్యాయ‌వాది గానీ అందుబాటులో లేరు. ఖ‌ర్ రెసిడెన్షియ‌ల్ అపార్ట్‌మెంట్‌లో చ‌ట్ట‌విరుద్దంగా ఐదో అంత‌స్తు అపార్ట్‌మెంట్ నిర్మించార‌ని ఆరోపిస్తూ కంగ‌న ర‌నౌత్‌కు 2018లోనే బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) నోటీసు జారీ చేసింది. దీన్ని ఆమె గ‌తేడాది స‌వాల్ చేశారు. ఇటివ‌ల బాంబేలోని త‌న కార్యాల‌యాన్ని కూల్చిన‌పుడు బీఎంసీకి వ్య‌తిరేకంగా బాంబే హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసి విజ‌యం సాధించారు. అలాగే త‌న ఇంటిని కాపాడుకోవాల‌ని కంగ‌న ర‌నౌత్ నిర్ణ‌యించుకున్నారు. సెప్టెంబ‌ర్ నెల‌లో కంగ‌నా ర‌నౌత్, అధికార శివ‌సేన నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగిన సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *