మూడు జిల్లాల ప‌ర్య‌ట‌న ర‌ద్దు -నిమ్మ‌గ‌డ్డ‌

హైద‌రాబాద్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పంచాయ‌తీ ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌టి విడుత ముసింది…. అంద‌రికి తెలిసిన విష‌య‌మే. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంఘం క‌మిష‌నర్ నిమ్మ‌గ‌డ్డ ఈరోజు ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టించాల్సిఉంది. అయితే ఈప‌ర్య‌ట‌న ర‌ద్దైంది. కంటి ఇన్‌ఫెక్ష‌న్ కార‌ణంగా ఎస్ఈసీ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఈరోజు ఎల్వీ ప్ర‌సాద్ కంటి ఆస్ప‌త్రిలో వైద్య పరీక్ష‌లు చేయించుకోనున్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల ఏర్పాట్లు, నిర్వ‌హ‌ణ‌పై అధికారంతో స‌మీక్ష నిర్వ‌హించ‌డానికి నేడు క‌డ‌ప‌, అనంత‌పురం, క‌ర్నూలులో ప‌ర్య‌టించాల‌ని ఎస్ ఈసీ నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *