యుద్ధ అభ్యాస్ 16 వ విడ‌త శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు…

జైపూర్: ఇండియా ఆర్మీ170 ఇన్‌ఫాంట్రీ ద‌ళ క‌మాండ‌ర్ ముకేశ్ భన్వాలా నేతృత్వంలో ప‌శ్చిమ సెక్టార్‌లోని మ‌హాజ‌న్ ఫైరింగ్ రేంజ్ లో ఈవ్యాయామ ప్ర‌క్రియ మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా యూఎస్ ద‌ళానికి ముకేశ్ భ‌న్వాలా స్వాగతం ప‌లికిన‌ట్లు ర‌క్ష‌ణ‌శాఖ అధికారి ప్ర‌త‌నిధి లెప్టినెంట్ క‌ల్న‌ర్ అమితాబ్ శ‌ర్మ ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ఇండియా, అమెరికా ఆర్మీ ద‌ళాలు సంయుక్తంగా నిర్వ‌హించే యుద్ధ అభ్యాస్ 16 వ విడ‌త శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు సోమ‌వారం రాజ‌స్థాన్ లో లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ద‌ళాల మ‌ధ్య ఆలోచ‌న‌లు పంచుకోవ‌డం స‌హా ఒక‌రికొక‌రు కార్యాచ‌ర‌ణ అనుభ‌వాల నుంచి నేర్చుకోవ‌ల‌సిన అవ‌స‌రాన్ని భ‌న్వాలా ప్ర‌త్యేకంగా వెల్ల‌డించారు. ఈ ప్ర‌క్రియ‌లో భాగంగా యూఎస్ ఆర్మీకి చెందిన అధునాత‌న లైట్ హెలికాప్ట‌ర్ డ‌బ్ల్యూఎస్ఐ రుద్ర‌, ఎంఐ17,చినూక్స్‌, స్ట్రైక‌ర్ వాహ‌నాల‌తో పాటు..ఇండియా ఆర్మీకి చెందిన ఇన్‌ఫాంట్రీ కంబాబ్ వాహ‌నాలు ఉప‌యోగించ‌నున్న‌ట్లు తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 21వ‌ర‌కు ఈ విన్యాసాలు కొన‌సాగ‌నున్నాయ‌ని తెలిపారు. కాగా ఈమ‌ధ్య కాలంలో ఇండియా,ఫ్రాన్స్ దేశాల‌కు చెందినవైమానిక ద‌ళాలు సంయుక్తంగా ఐదు రోజుల పాటు డ్రిల్ నిర్వ‌హించిన వెంట‌నే ఈ ప్ర‌క్రియ ప్రారంభం కావ‌డం గ‌మ‌నార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *