ఇద్ద‌రు నేత‌లు వ‌ర్చువ‌ల్ గా భేటీ….

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అమెరికా అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ వ‌‌ర్చున‌ల్‌గా భేటీకానున్నారు. ఆస్ట్రేలియా నిర్వ‌హించ‌నున్న క్వాడ్ స‌మావేశంలో భార‌త‌ప్ర‌ధాని, అమెరికా అధ్య‌క్షుడు క‌లుసుకోన్న‌ట్లు తెలుస్తోంది. క్వాడ్‌లోని సభ్య‌దేశాలైన అమెరికా ,జ‌పాన్‌, ఆస్ట్రేలియా ,ఇండియా త్వ‌ర‌లో భేటీకానున్న‌ట్లు ఈరోజు ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్ ప్ర‌క‌టించారు. చైనా ఆధిప‌త్యాన్ని ఢీకొట్టేందుకు క్వాడ్ గ్రూపును ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో డ్రాగ‌న్ దేశంతో అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు కయ్యానికి దిగాయి. ప‌లు ద్వైపాక్షిక‌, వాణిజ్య అంశాల్లో చైనాతో ఆ రెండు దేశాలు విభేదాలు వ్య‌క్తం చేశాయి. గ‌తంలో స‌రిహ‌ద్దు అంశంలో భార‌త్ తోనూ చైనా త‌గ‌దాకు దిగిన సంగ‌తి తెసిలిందే. అమెరికా అధ్య‌క్షుడిగా బైడెన్ ఎన్నికైన త‌రువాత ప్ర‌ధాని మోదీ ఓసారి ఫోన్‌లో సంభాషించారు. కానీ తొలిసారి ఈ ఇద్ద‌రి మ‌ధ్య‌వ‌‌ర్చువ‌ల్ భేటీ జ‌ర‌గ‌నున్న‌ది. ఈ మీటింగ్‌కు సంబంధించి ప్ర‌ధానిమంత్రి కార్యాలయం ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.కానీ క్వాడ్ స‌ద‌స్సుకు బైడెన్ హాజ‌రు అవుతార‌ని ఆసీస్ ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్ వెల్లడించారు. దీని వ‌ల్ల బైడెన్‌, మోదీ మ‌ధ్య భేటీ జ‌రిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇండో-ప‌సిఫిక్ ప్రాంతంలో శాంతి, ర‌క్ష‌ణ కోసం నాలుగు దేశాలు ప‌నిచేయ‌నున్న‌ట్లు స్కాట్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *