గ్రీన్ కార్డు కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నా బైడెన్‌…

వాషింగ్ట‌న్‌: కొత్తగా అలాంటిదే మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గ్రీన్ కార్డు ద‌ర‌ఖాస్తుదారులు అమెరికాలోకి అడుగుపెట్ట‌కుండా గ‌త ట్రంప్ ప్ర‌భుత్వం విధించిన నిషేధాన్ని బైడెన్ ఎత్తేశారు. గ‌త సంవ‌త్స‌రం క‌రోనా కార‌ణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికా వ‌ర్క‌ర్ల హ‌క్కును కాపాడేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ట్రంప్ అప్ప‌ట్లో చెప్పారు. అయితే ట్రంప్ చెప్పిన కార‌ణం స‌రైన‌ద‌ని కాదు అని కొత్త ప్ర‌క‌ట‌న‌లో బైడెన్ స్ప‌ష్టం చేశారు.డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యాల‌ను రివ‌ర్స్ చేసే ప‌నిలో ఉన్న అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌. ఈ ఆంక్ష‌లు అమెరికా వ్యాపారాల‌ను త్రీవంగా దెబ్బ‌తీశాయ‌ని బైడెన్ చెప్పారు. ట్రంప్ తీసుకొచ్చిన ఎన్నో ఇమ్మిగ్రేష‌న్ విధానాల‌ను తాను రివ‌ర్స్ చేస్తాన‌ని ఎన్నిక‌ల సంద‌ర్బంగా బైడెన్ చెప్పిన విష‌యం తెలిసిందే. అందులో భాగంగా ఆయ‌న ఈ కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *