స‌రికొత్త అధ్యాయీన్ని లిఖించిన క్రికెట‌ర్‌….

చెన్నై: వ‌ంద‌వ టెస్టులో డ‌బుల్ సెంచ‌రీ చేసిన తొలి క్రికెట‌ర్‌గా ఘ‌న‌త సాధించిన చెన్నై టెస్ట్ మ్యాచ్‌లోరూట్ అద్భుత‌మైన బ్యాటింగ్ శైలిని ప్ర‌ద‌ర్శించాడు. టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ స‌రికొత్త అధ్యాయ‌నం లిఖించాడు.బౌల‌ర్ల‌కు స‌హ‌క‌రించని చిదంబ‌రం స్టేడియంలో .. రూట్ భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఓ భారీ సిక్స‌ర్‌తో జో రూట్ ఖాతాలో డ‌బుల్ సెంచ‌రీ 19 ఫోర్లు,రెండు సిక్స‌ర్లు ఉన్నాయి. నాలుగో వికెట్‌కు బెన్ స్టోక్స్‌తో క‌లిసి భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పిన రూట్‌. స్టోక్స్ నిష్క్ర‌మ‌ణ త‌రువాత ద్విశ‌త‌కాన్ని అందుకున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూల‌మైన వికెట్‌పై రూట్ త‌న స్ట‌యిలిస్ ఆట‌ను కొన‌సాగించాడు. ఎటువంటి చెత్త షాట్లు ఆడ‌కుండా… భారీ ఇన్నింగ్స్‌పై దృష్టిపెట్టాడు. టాఫ్ ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ చెన్నై మైదానంలోనూ త‌న ఆట‌తీరుతో అల‌రించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి రూట్ త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు. బౌల‌ర్ల‌కు ఎటువంటి ఛాన్స్ ఇవ్వ‌లేదు. రెండ‌వ రోజు టీ విరామ స‌మ‌యానికి ఇంగ్లండ్ నాలుగు వికెట్ల‌కు454 ర‌న్స్ చేసింది. రూట్‌.209,పోస్ 24 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *