జీవిత‌నే త‌న మెడ‌లోతాను బీజేపీ కండువా వేసుకున్నారు….

సినీ న‌టి జీవితారాజ‌శేఖ‌ర్ వైసీపీకి ఝ‌ల‌క్ ఇచ్చారు. వైసీపీలో చేరి జ‌గ‌న్‌ను విమ‌ర్శించి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి..2019 ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్ స‌మ‌క్షంలో మ‌ళ్లీ వైసీపీ కండువా క‌ప్పుకున్న సినీన‌టి జీవితారాజ‌శేఖ‌ర్ తాజాగా బీజేపీలో చేర‌డం కొస‌మెరుపు. సోమ‌వారం నాడు బండి సంజ‌య్ స‌మ‌క్షంలో ఆమె భార‌తీయ జ‌న‌తాపార్టీ చేరారు. అయితే…ఈ సంద‌ర్భంలో ఆసక్తిక‌ర ప‌రిణామం చోటుచేసుకుంది. గ్రేట‌ర్ కు చెందిన కొంద‌రు ఇత‌ర పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ప‌క్క‌నే ఉన్న ఉన్నారు. కార్య‌క‌ర్త‌ల‌కు కూడా బీజేపీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన బండి సంజ‌య్ మెడ‌లో ఉన్న జీవిత కు మాత్రం పార్టీ కండువా మెడ‌లో వేయ‌క‌పోవ‌డం కొస‌మెరుపు . చివ‌ర‌కు జీవిత‌నే త‌న మెడ‌లో తాను బీజేపీ కండువా వేసుకున్నారు. రాజ‌శేఖ‌ర్ ఇటీవ‌లే అనారోగ్యం నుంచి కోలుకోవ‌డంతో ఆయ‌న ఈ సంద‌ర్భంలో జీవిత ప‌క్క‌న లేర‌ని తెలిసింది. జీవితారాజ‌శేఖ‌ర్ గ‌తంలోనూ బీజేపీలో చేరి కొన్నాళ్లు ఆ పార్టీలో కూడా కొన‌సాగిన విష‌యం విదిత‌మే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *