అరుదైన రికార్డుల‌ను సొంతం చేసుకున్నా బుమ్రా….

చెన్నై: ఇప్పుడు ఇంగ్లండ్ తో జ‌రుగుతున్న మొద‌టి టెస్ట్‌లో టీమీండియా టీమ్ నుంచి బుమ్రా రెండు అరుదైన రికార్డులు సొంతం చేసుకోన్నాడు. ఆయ‌న ఈ మ్యాచ్‌లో బౌలింగ్ మొదలు పెట్ట‌క ముందే ఈ రికార్డుల‌ను అత‌డు త‌న‌ఖాతాలో వేసుకున్నాడు. భార‌త్‌లో బుమ్రా ఆడుతున్న మొద‌టి టెస్ట్ మ్యాచ్ ఇదే అన్న విష‌యం తెలుసుక‌దా. ఇలా సొంత‌గ‌డ్డ‌పై అరంగేట్రం చేసే ముందు విదేశాల్లో అత్య‌ధిక టెస్టులు ఆడిన ప్లేయ‌ర్గా బుమ్రా నిలిచాడు. 2018 సౌతాఫ్రికాలో టెస్ట్ అరంగేట్రం చేసిన బుమ్రా ఇప్ప‌టి వ‌ర‌కూ 17 టెస్టులు ఆడాడు. అవ‌న్ని విదేశాల్లోనే కావ‌డం విశేషం. బుమ్రా కంటే ముందు వెస్టిండీస్ ప్లేయ‌ర్ డారెన్ గంగా కూడా ఇలాగే స్వదేశం బ‌య‌ట 17 టెస్టులు ఆడాడు. వీళ్ల త‌రువాతి స్థానంలో భార‌త్ మాజీ పేవ‌ర్ జ‌వ‌గ‌ళ్ శ్రీ‌నాథ్ (12టెస్టులు) ఉన్నాడు. ఇక ఈ 17 టెస్టుల్లో బుమ్రా 79 వికెట్లు తీసుకున్నాడు. ఇది కూడా ఓ రికార్డే. స్వ‌దేశంలో తొలి టెస్ట్ ఆడే ముందు ఇన్ని వికెట్లు తీసిన తొలి బౌల‌ర్ బుమ్రానే. అత‌ని కంటే ముందు విండీస్ స్పిన్న‌ర్ ఆల్ఫవాలెంటైన్ స్వ‌దేశంలో త‌న తొలి మ్యాచ్‌కు ముందు 65 వికెట్లు తీసుకున్నాడు. ఇక స్వ‌దేశంలో టెస్టుల్లో తాను వేసిన తొలి ఓవ‌ర్లోనే బుమ్రా వికెట్ తీసేలా క‌నిపించినా.. వికెట్ కీప‌ర్ పంత్ క్యాచ్ వ‌దిలేయ‌డంతో ఆ అవ‌కాశం ద‌క్క‌లేదు. త‌న‌7వ ఓవ‌ర్లో ఇంగ్లిష్ బ్యాట్స్‌మ‌న్ లారెన్స్‌ను ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ చేసి ఇండియాలో తొలి వికెట్ తీసుకున్నాడుబుమ్రా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *