భార‌త్-చైనా సంబంధాలు బల‌ప‌డాలంటే 8 సూత్రాలు పాటించాలి..

న్యూఢిల్లి: చైన్నా -భార‌త్ మైత్రి బంధాలు బ‌ల‌ప‌డాలంటే ఎనిమిది ముఖ్య సూత్ర‌ల‌ను ప్రతిపాదించారు. ఈరోజు ఆన్‌లైన్ కాన్ప‌రెన్స్‌లో పాల్గొన్న ఆయ‌న చైన్నా -భార‌త్ స‌రిహ‌ద్దుల స‌మ‌స్య‌లు త‌గ్గించేందుకు 8 అంశాలను ప్ర‌తిపాదించారు. వాస్త‌వాదీన రేఖ కోసం కుదిరిన అన్ని ఒప్పందాల‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌న్నారు. ఆ ఒప్పందాల‌ను ప‌ర‌స్ప‌రం గౌర‌వించాల‌న్నారు. సున్నిత‌త్వంలో ‌వ‌హ‌రించాల‌న్నారు. ఆసియా ఖండంలో బ‌ల‌మైన శ‌క్తుల‌మ‌న్న అవ‌గాహ‌నతో చైనా మెల‌గాల‌ని జైశంక‌ర్ పేర్కొన్నారు. ల‌డాఖ్ లోని గాల్వ‌న్ ఘ‌ర్ష‌ణ త‌రువాత చైనాతో సంబంధాలు బ‌ల‌హీన ప‌డిన సంగ‌తి తేలిసిందే. ఏక‌ప‌క్షంగా ఎల్ఏసీని మారిస్తే దాన్ని స‌హించ‌బోమ‌ని ఆయ‌న అన్నారు. స‌రిహ‌ద్దు వ‌ద్ద ఉద్రిక్త‌త‌లు త‌గ్గ‌డం అంత సులువైన ప‌నికాదు అన్నారు. వాస్త‌వానికి రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన్నాయ‌ని ,కానీ ప్ర‌స్తుతం ఈ రెండు దేశాలు తీసుకునే నిర్ణ‌యాలు చాలా దీర్ఘ‌మైన ప‌ర్య‌వ‌సానాల‌కు దారి తీస్తుంద‌ని, దీని వ‌ల్ల కేవ‌లం రెండు దేశాల‌కేకాదు, యావ‌త్ ప్ర‌పంచంపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని జైశంక‌ర్ అన్నారు. స‌రిహ‌ద్దు అంశంలో చైనా ఎందుకు ఎలా ప్ర‌వ‌ర్తించింద‌న్న దానిపై ఇంత వ‌ర‌కు ఎటువంటి విశ్వ‌స‌నీయ స‌మాచారం లేద‌ని ఆయ‌న అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *