సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న నిమ్మ‌గ‌డ్డ ..

అమ‌రావ‌తిః రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ త‌న అధికారాల‌కు మరింత ప‌దును పెట్టారు. ఎన్నిక‌ల సంఘం ఆదేశాల‌ను బేఖాత‌రు చేస్తున్న అధికారుల‌పై వ‌రుస‌గా క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. తాజాగా సెక్ర‌ట‌రీగా ఉన్న వాణీ మోహ‌న్‌ను తొల‌గిస్తూ ఎస్ ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు సీఎస్‌కు లేఖ రాశారు. వాణీమోహ‌న్ సేవ‌లు ఎన్నిక‌ల క‌మిష‌న్‌లో అవ‌స‌రం లేద‌ని లేఖ‌లో తెలిపారు. వాణీమోహ‌న్‌ను రిలీవ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.చేశారు. ఇదిలా ఉంటే, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం జాయింట్ డైరెక్ట‌ర్ జీవీ సాయి ప్ర‌సాద్‌పై సోమ‌వారం క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకున్నారు. 30రోజుల‌పాటు సెల‌వుపై వెళ్లిన సాయిప్ర‌సాద్‌…. ఇత‌ర ఉద్యోగుల‌ను సైతం సెల‌వుపై వెళ్లేలా ప్ర‌భావితం చేశార‌ని అభియోగాలు ఉన్నాయి. దీన్ని క్ర‌మ‌శిక్షణారాహిత్యంగా ప‌రిగ‌ణించిన ఎన్నిక‌ల క‌మిష‌న్‌.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు విఘాతం క‌లిగించేలా చ‌ర్య‌లున్నాయంటూ సాయిప్ర‌సాద్‌ను విధుల నుంచి తొల‌గించింది. ఇత‌ర ప్ర‌భుత్వ స‌ర్వీసుల‌లో ప్ర‌త్య‌క్షంగా లేదా… ప‌రోక్షంగా విధులు నిర్వ‌హించ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *