ధోని రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శ‌ర్మ‌….

చెన్నై: ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహ‌త్ శ‌ర్మ ఐపీఎల్ లో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. ఈ నేపథ్యంలో అత‌డు చెన్నై సూప‌ర్‌కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్‌ధోనీని వెన‌క్కి నెట్టాడు. స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్ 32 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే అందులో అత‌డు రెండు సిక్స‌ర్లు బాదాడు. దీంతో ఐపీఎల్లో రోహిత్ శ‌ర్మ మొత్తం సిక్స‌ర్ల సంఖ్య 217 కు చేరింది. ఇన్నాళ్లూ ఐపీఎల్ లో అత్య‌ధిక సిక్స్‌లు కొట్టిన ఇండియన్ ప్లేయ‌ర్‌గా ధోని(216) పేరు మీద ఉన్న రికార్డును రోహీత్ చెరిపేశాడు. ఓవ‌రాల్‌గా ఐపీఎల్ లో అత్య‌ధిక సిక్స్‌లు బాదింది క్రిస్‌గేల్ (315) కాగా, ఏబీ డివిలియ‌ర్స్ (237) త‌రువాతి స్థానంలో ఉన్నాడు. ఇక ధోనీ, రోహిత్ త‌రువాత విరాట్ కోహ్లీ (201) ఉన్నాడు. ఇక కెప్టెన్‌గా టీ20ల్లో 4 వేల ప‌రుగుల రికార్డును కూడా ఇదే మ్యాచ్‌తో రోహిత్ అందుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *