నాలుగు మ్యాచ్‌లు చిత‌క్కొట్టాడు- రాహుల్‌వాంఖ‌డే

హైద‌రాబాద్‌: ఓసెంచ‌రీ కూడా బాదాడు, మూడుస్లారు తొంబైపరుగులు దాటి స్కోర్ చేసిన పంజాబ్‌కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వాంఖ‌డేలో గ‌త నాలుగు మ్యాచులూ చిత‌క్కొట్టాడు. మొత్తంగా అక్క‌డ అత‌డి స‌గ‌టు 75 పైనే ఉంది. అత‌డి బ్యాటింగ్ ల‌య‌ను చూస్తుంటే శుక్ర‌వారం మ్యాచ్‌లోనూ దంచ‌డంఖాయం అనిపిస్తోంది.మ‌యాంక్ అగ‌ర్వాల్ ఓపెనింగ్ లో కుదురుకుంటే వీరిద్ద‌రినీ ఆప‌డం చెన్నై బౌలింగ్ ద‌ళానికి క‌ష్ట‌మే .ఇక మొద‌టి మ్యాచ్‌లో గేల్ (40,28 బంతుల్లో) కూడా అద‌ర‌గొట్టాడు. అంచ‌నాలు అంత‌గా లేని దీప‌క్ హూడా 28 బంతుల్లో 64 ప‌రుగులు చేశాడు. 4 బౌండ‌రీలు, 6 సిక్స‌ర్ల‌తో త‌న స‌త్తా ఏంటో చూపించాడు. నికోల‌స్ పూర‌న్ కూడా దంచ‌డం మొద‌లుపెడితే భారీ స్కోరు సాధించిన‌ట్టే, ష‌మీ.. అర్ష‌దీప్‌.. మొద‌టి మ్యాచ్‌లో మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. భారీగా ప‌రుగులు న‌మోదైన మ్యాచ్‌లో కేవ‌లం 8.25 ఎకాన‌మీ ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. అంతేకాదు. యువ‌బౌల‌ర్ అర్ష‌దీప్ కూడా
చ‌క్క‌నిలైన్ అండ్ లెంగ్త్ లో బంతులు వేస్తూ 3వికెట్లు తీశాడు. అయితే బాగా అంచ‌నాలు పెట్టుకున్న జే రిచ‌ర్డ్‌స‌న్ భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకోవ‌డం స‌మ‌స్య‌గా మారింది. మెరిడెత్, మురుగ‌న్ అశ్విన్ కూడా ఆశించ‌ద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. ఈ మ్యాచ్‌లో వాళ్లు పుంజుకుంటే చెన్నైని నిలువ‌రించ‌డం సాధ్య‌ప‌డుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *