యాంజియోప్లాస్టీ -ముత్త‌య్య‌ముర‌ళీద‌ర‌న్‌

చెన్నై: స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ స‌పోర్ట్ స్టాఫ్‌లో భాగ‌మైన ‌ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ యాంజియోప్లాస్టీ నిర్వ‌హించారు. ఇప్పుడు స‌న్ రైజ‌ర్స్ జ‌టు చెన్నైలో ఉండ‌టంతో అత‌నికి అక్క‌డే ఓ ఆసుప‌త్రిలో ఈ ప్ర‌క్రియ‌ను పూర్తి చేశారు. మార్చి చివ‌ర్లో ముర‌ళీధ‌ర‌న్‌లో ఓ బ్లాకేజ్ గుర్తించార‌ని, అందుకే ఈ యాంజియోప్లాస్టీ నిర్వ‌హించిన‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి.ఇప్ప‌టికే ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్లో అత్య‌ధిక వికెట్ల రికార్డు ముర‌ళీధ‌ర‌న్ పేరిటే ఉంది. శ్రీ‌లంక త‌ర‌పున 133 టెస్టులో 800 వికెట్లు, 350 వ‌న్డేల్లో 534 వికెట‌లు, 12టీ20ల్లో 13 వికెట్లు తీశాడు. ఇలా మొత్తంగా 1347 అంత‌ర్జాతీయ వికెట్లు ముర‌ళీఖాతాలో ఉన్నాయి. 1996 లోశ్రీ‌లంక వ‌రల్డ్‌క‌ప్ గెల‌వ‌డంతో అత‌నిదే కీల‌క పాత్ర.2015 నుండి స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టుకు బౌలింగ్ కోచ్ గా , మెంటార్‌గా ఉంటున్నారు.
I

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *