14వ సీజ‌న్ నుండి త‌ప్పుకున్న ఇద్ద‌రు ఆట‌గాళ్లు…

న్యూఢిల్లీ: 2021 ఐపీఎల్ 14వ సీజ‌న్ నుండి షెడ్యూల్ క‌న్నాముందే త‌ప్పుకున్న బంగ్లాదేశ్ ఆట‌గాళ్లు ష‌కీబ్ అల్ హ‌స‌న్‌, ముస్తాఫిజుర్ రెహ‌మాన్. భార‌త‌దేశంలో కొవిడ్ మ‌హ‌మ్మారి విలాయ‌తాడ‌వం చేస్తున్న త‌రుణంలో ఇండియా నుండి బంగ్లాదేశ్ కు వ‌చ్చే ప్రయాణికులు 14 రోజులు పాటు క్వారంటైన్‌లో ఉండాల‌ని ఆ దేశ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. వ‌చ్చే 15 రోజులు మీ ప్రణాళిక ఏంటోమాకు తెలియ‌జేయాల‌ని ష‌కీబ్‌, ముస్తాపిజుర్‌ల‌ను మేం కోరాం. ఇద్ద‌రు ఆట‌గాళ్లు ఎలాంటి క్వారంటైన్ నిబంధ‌న‌లు అనుస‌రించాలో కూడా మేం ఇప్ప‌టికే ఆరోగ్య మంత్రిత్వ శాఖ‌ను కోరామ‌ని బంగ్లా క్రికెట్ బోర్డు చీఫ్ నిజాముద్దీన్ చౌధురి తెలిపారు. వాళ్లిద్ద‌రూ ఏడు లేదా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంద‌ని ఆరోగ్య‌శాఖ సూచించిన‌ట్లైతే వారు ఐపీఎల్ నుండి షెడ్యూల్ కంటే ముందుగానే తిరిగి రావాల్సి ఉంటుంది. మేం బంగ్లాదేశ్ ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నాం. ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుగుణంగా నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని చౌధురి వివ‌రించారు.ఐపీఎల్‌లో ష‌కీల్ కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌ర‌పున ఆడుతుండ‌గా, ముస్తాఫిజురు రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *