రోహిత్ స‌ర‌దాగా స‌న్ రైజ‌ర్స్ కెప్టెన్ వార్న‌ర్ ఆట‌ప‌ట్టించాడు…

హైద‌రాబాద్‌:హైద‌రాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ శుక్ర‌వార‌మే ఆస్ట్రేలియా నుంచి చెన్నై చేరుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం టీమ్ అక్క‌డే బ‌స ఏర్ప‌టు చేసింది. దాంతో వార్న‌ర్ ఇప్పుడు త‌న గ‌దిలోనే క్వారంటైన్‌లో ఉన్నాడు. ఈ సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పంచుకొని క్వారంటైన్‌లో ఎలా గ‌డ‌పాలో స‌ల‌హాలు , సూచ‌న‌లు చేయ‌మ‌ని వార్న‌ర్ అభిమానుల‌ను కోరాడు. ఐపీఎల్ ఆడేందుకు వ‌చ్చాను. క్వారంటైన్‌లో ఉండ‌డానికి సిద్ధ‌మ‌య్యా.కానీ నాకు ఒక‌టే స‌మ‌స్య ఎదురైంది. క్వారంటైన్‌లో ఉండాల్సిన‌న్ని రోజులు ఎలా గ‌డ‌పాలో మీరు స‌ల‌హాలివ్వండి. వాటిని కామెంట్స్‌లో పెట్టండి.అంటూ వ్యాఖ్యానించారు. ఇది చూసిన రోహిత్ వెంట‌నే స్పందించాడు. టిక్ టాక్ అవ‌తున్న‌ట్లు ఉన్నావ్ అంటూ త‌న‌దైన‌శైలిలో హాస్యం జోడించిన కామెంట్ చేశాడు. దీనికి నెటిజెన్ల నుంచిపెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు వ‌చ్చాయి. కాగా, గ‌తేడాది క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఐపీఎల్ 13వ సీజ‌న్ వాయిదా ప‌డిన వేళ‌..లాక్‌డౌన్‌లో వార్న‌ర్ టిక్ టాక్ వీడియోలు చేశాడు. త‌న‌తో పాటు భార్య క్యాండీస్‌, త‌న ముగ్గురు పిల్ల‌ల‌తో పాటు డ్యాన్సులు చేసి నెటిజెన్ల‌కు చేరువ‌య్యాడు. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ పాటలు, మూవీ డైలాగుల‌తో అల‌రించాడు. అయితే, కొద్ది నెల‌ల క్రితం టిక్ టాక్‌తో పాటు మ‌రిన్ని చైనా యాప్‌ల‌ను భార‌త‌ప్ర‌భుత్వం నిషేధించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రోహిత్ స‌ర‌దాగా స‌న్ రైజ‌ర్స్ కెప్టెన్‌ను ఆట‌ప‌ట్టించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *